Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46




మానవుఁడౌ కృష్ణుమహిమల విశ్వరూపు !
పూని బండి నుంచుకొన్న పోటుబంట యర్జునా ॥ఇంది॥ 2

శ్రీవల్లభునకు నశేషకైంకర్యములా !
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితి !
కైవసమైన యట్టి కార్తవీర్యార్జునుఁడా యీ !
దేవుని నీవేళ నిట్టి మాకుఁ దెచ్చి యీయరే ॥ఇంది॥ 3

అన్న. అధ్యా. 373 ఱేకు.


క్రీ 1440 ప్రాంతములనో తర్వాతనో తురుష్కులు గాఁబోలును జరపిన దౌర్జన్యము నన్నమాచార్యుఁ డిట్లు చెప్పి చెప్పి చింతిల్లినాడు.


రామక్రియ


     తతిగాని యీపాటు దైవమా విచారించవే !
     కతలాయఁ జెప్ప నేఁడు కలికాల మహిమా ॥పల్లవి॥

తుటుములై భూసురుల తుండెములు మొండెములు !
యిటువలె భూతములు యెట్టు మోఁచెనో !
అటుబాలుల రొదలు ఆకాశమె ట్టోరిచెనో !
కటకటా యిట్లాయఁ గలికాలమహిమా ॥తతి॥ 1

అంగలార్చే కామినుల యంగభంగపు దోఁపు !
లింగితాన మింటసూర్యుఁ డెటు చూచెనో !
పొంగు నానాజాతిచేత భువన మెట్లానెనో !
కంగి లోక మిట్లాయఁ గలికాలమహిమా ॥తతి॥ 2

అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలార్వ !
సరిధర్మదేవ తెట్టు సమ్మతించెనో !
పరధనచూఱ కెట్టు పట్టాయనో లక్ష్మి !
కరుణ యెం దణఁగెనో కలికాలమహిమా ॥తతి॥ 3

దేవాలయాలు నానాదేశము లెల్లాఁ జొచ్చి !
దేవఁగా నెట్లుండిరో దేవతలు !