45
కొడుకు నున్నతమతిం గోరి చంపెడువాఁడు ! కడుఁ బాతకుఁడుగాక ఘనుఁడటా ! కడలేని యిటువంటి కలుషవృత్తికి నాత్మ ! వొడఁబఱపఁగ నే నె ట్లోపుదునయ్యా || కుఱు || 3
తల్లిఁ జంపెడువాఁడు తలఁప దుష్టుడు గాక ! యెల్లవారల కన్న నెక్కుడటా ! కల్లరి యనుచు లోకము రోయుపని యిది చెల్లఁబోనే నేమి సేయుదు నయ్యా || కుఱు || 4
యింటివేలుపు వెంకటేశ్వరుఁ దనవెంట ! వెంటఁ దిప్పెడువాఁడు విభుఁడటా ! దంటనై యాతని దాసానుదాసినై ! వొంటి నుండెద నేమి నొల్లనోయయ్యా || కుఱు || 5
అన్న అధ్యా. 38 ఱేకు.
విజయనగర రాజ్యముమీదికి (కపిలేశ్వర, పురుషోత్తమ) గజపతులు దండెత్తి వచ్చునపుడో యింకెపుడో అన్నమయ విజయనగరములోనో స్వగ్రామముననో ఉండఁగా నాతని దేవతార్చన విగ్రహములను శత్రువు లెత్తుకొనిపోవుటో, స్థలముమార్చు గజిబిజిపాటులో నేమో అయిపోవుటో జరగి కానరాకపోఁగా సంకీర్తనరూపమున నిట్లు విలపించినాఁడు.
బౌళి
ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మా కిటువలె ! పొంది యీతనిఁ బూజించఁ బొద్దాయ నిపుడు || పల్లవి ||
ధారుణి మైరావణు దండించి రాముఁ దెచ్చి ! నేరువు మించిన యంజనీతనయా ! ఘోరనాగపాశములఁ గొట్టివేసి యీతని ! కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా || ఇంది || 1
నానాదేవతలకు నరసింహుఁ గంభములో ! పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుఁడా !