40
వేనామాల వెన్నుండా వినుతించ నెంతవాఁడ !
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా ॥దాచు॥ 2
ఈమాట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని !
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను !
నేమానం బాడేవాఁడను నేరము లెంచకుమీ !
శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా ॥దాచు॥ 3
అన్న అధ్యా. 169 ఱేకు.
లలిత
బల్లిదులు నీకంటెఁ బరు లున్నారా నన్నుఁ !
దొల్లిటి బారి నింకం దోయకు మోయయ్య ॥పల్లవి॥
చిక్కులభవములఁ జేరం జిక్కి వోపలేక !
నిక్కి నీమఱుఁగు చొచ్చి నిలిచితిని !
అక్కజమై యల్లనాఁటి అప్పులకర్మము లెల్ల !
ఇక్కడనే చుట్టుముట్టీ నేమి సేతునయ్య ॥బల్లి॥ 1
లచ్చి సంసారమునకు లగ్గ మచ్చితీరలేక !
యిచ్చట నిన్నుఁగొలిచి యెక్కువైతిని !
పొచ్చముల నల్ల నాఁటి వూఁటదీర దని కొన్ని !
బచ్చన బందాలు వచ్చెఁ బాపఁగదవయ్య ॥బల్లి॥ 2
అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక !
ముంచి నీపాదలకు మొఱవెట్టితి !
పొంచిన శ్రీవేంకటేశ భువనరక్షకుఁడవు !
పంచలనున్నాఁడ నన్నుఁ బాలించవయ్య ॥బల్లి॥ 3
అన్న అధ్యా, 361 కుఱే
సకల వేదాంతశాస్త్రము నన్నమయ యధ్యయనముగావించెను. ఈ శఠకోపముని అహెూబలమఠ ప్రతిష్ఠాపనాచార్యులయిన యాదివన్ శఠకోప మునీశ్వరు లగుదురు. అన్నమయనాఁట నీశఠకోపయతులే వర్తిల్లిరి. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవా రీశఠకోపయతిని సన్నుతించిరి. (చూ. ఆశ్వా 7 వచనము) అన్నమాచార్యుఁ డీయతివర్యునిట్లు కీర్తించెను.