39
భౌలి
పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను || పల్లవి ||
తనువే వొళవు తలయే దండెకాయ ! ఘనమైనవూర్పులు రెండు కట్టినత్రాళ్ళు ! మనసె నీ బద్దితాడు మఱి గుణాలె జీవాళి ! మొనసినపుట్టుగె మూలమైనకరడి || పాడే || 1
పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు పైపైఁ గుత్తికె మేటి పైచనిగె ! కోపులనాలికె లోనఁ గుచ్చికట్టినట్టిత్రాడు ! చూపరాని సంసారమె సూత్రపుఁగణిక || పాడే || 2
జీవునకు నీదండె సేసిన వాఁడవు నీవు ! వావాతిమాటలే నీపై వన్నె పదాలు ! ఈవే మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి ! శ్రీవెంకటేశ నీవే చేకొన్నదాతవూ || పొడే || 3
అన్న అధ్యా. 281 ఱేకు.
గుండక్రియు
దాఁచుకొని పాదాలకుఁ దగ నేఁజేసినపూజ లివి ! పూఁచి నీకీరితిరూపు పుష్పము లివి యయ్యా || పల్లవి ||
ఒక్కసంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ ! తక్కినవి భండారాన దాఁచి వుండనీ ! వెక్కసము నీనామము వెలసులభము ఫల మధికము ! దిక్కై నన్నేలితి వింక నవి తీరనినాధనమయ్యా || దాచు || 1
నానాలికపై నుండి నానాసంకీర్తనలు ! పూని నాచే నిన్నుఁ బొగడించితివి !