పుట:Annamacharya Charitra Peetika.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37 దేసాళం ఎట్టిహితోపదేశకుం డెటువంటి దయాళువు | అట్టే తాళ్ళపాకన్నమాచార్యుఁడు |పల్లవి। పచ్చితామసుల మమ్ముం బరమసాత్వికులఁగా నిచ్చటనే చేసినాఁడు యెంతచిత్రము ఇచ్చగించి మాకులాన నెన్నఁడు లేనివైష్ణవ | మచ్చముగాఁ గృపసేస నన్నమాచార్యుఁడు ||ఎట్టి 1 ముదిరినపాపకర్మములు సేసినట్టి మమ్ము ! యెదుటఁ బుణ్యులఁ జేసె నెంతసోద్యము కదిసి యేజన్మానం గాననిసంకీర్తన ! మదన నుపదేశించె నన్నమాచార్యుఁడు ||ఎట్టి| 2 గడుసుందనపు మమ్ముఁ గడువివేకులఁ జేసి యిడుమ లెల్లాఁ బాపె నేగురుఁడు ! నడుమనే యెన్నడుఁ గానని శ్రీ వెంకటనాథు ! నడియాలముగ నిచ్చె నన్నమాచార్యుఁడు ||ఎట్టి 3 చినతిరు, అధ్యా, 9 తేకు. అన్నమాచార్యచరిత్రమున (చూ 28 పుట.) నిక్కడఁ గొంత గ్రంథ పాత మున్నది. అందుఁగొన్నియేండ్లకాల మేమో గురుసన్నిధి నన్నమాచార్యుఁ డుండుట, అతని వెదకికొనుచు నాతనితల్లి తిరుమలకు వచ్చి కొడుకును జూచి యింటికి రమ్మని పిలుచుట, అతఁడు సమ్మతింపకుండుట, అందుపై గురుఁడేవో దివ్యోపదేశములు చేసి యింటికిఁ బొమ్మని మీ వంశమునఁ బుట్టబోవువారు మహనీయులు కాఁగలరని యాశీర్వదించుట, ప్రధానముగా నుండఁదగినకథాంశము. తొలుత నింటికిఁబో సమ్మతింప కున్నను గుర్వాజ్ఞగనుక నన్నమాచార్యుం డెట్టకేల కందుకు సమ్మతించెను. ఈ సందర్భమున సంకీర్తనము లున్నవి: