36 తాళ్ళపాక వారి సంకీర్తనములలో నిప్పటికి నేఁ జూచినంతలో పనుగుతైలముతోడికస్తూరీకర్పూరమిశ్రితమయిన పాదతీర్ధమే ప్రస్తుతమయినది గాని నేటి శ్రీపాదరేణుసంకలనరీతిగాని శ్రీపాదరేణునామముగాని కానరాలేదు. ఒక సంకీర్తనము: శంకరాభరణము శ్రీహరిపాదతీర్ధంబే చెడని మందు మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు పల్లవి కారమై కంటగించని కడుఁ జల్లని మందు! నూఅనికాచనియట్టి నున్ననిమందు! కోరికతో వెలవెట్టి కొనితేవల్లని మందు! వేరువెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు శ్రీహరి 1 గుఱుతైనరోగములు గుణముచేసేమందు! దురితములు పెడఁబాపే దొడ్డమందు! నిరతముబ్రహ్మదులు నేరుపుతో సేవించేమందు! నరకము సొరనట్టినయమయినమందు శ్రీహరి 2 పొంకముతో భయములు పొందనియ్యనిమందు! మంకు బుదులు మాన్పి మన్నించేమందు! పంకజాక్ష వేంకటరమణ ప్రపన్నునిమందు! సెంకించక తనదాసులఁ జేపట్టేమందు శ్రీహరి 3 అన్నమాచార్యుని సంకీర్తనములలో గురుస్తుతిపరములుగా రచనలు చాలఁగలవుగాని ఆగురువు పేరేమో సరిగ్గాఁ దెలియరాలేదు. ముద్రాధారణానంతరము ႕မွီျပ် లీతని బంతి నిడుకొని భుజించిరట (చూ 28 పుట) అన్నమాచార్యునినాఁడే యీ వంశమువారు వైష్ణవు లయిరి. ఈ విషయము నీతిని పెద్దమనుమఁడు చినతిరుమలాచార్యుఁ డిటు చెప్పకొన్నాఁడు.
పుట:Annamacharya Charitra Peetika.pdf/38
Appearance