Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35




అదె నల్లగలువల నకరువు లుండినట్టు!
మెదిగి కస్తూరిభూమి మేరువున్నట్టు!
యెదుట శ్రీ వెంకటేశునెద నలమేల్మంగను!
గుదిగుచ్చి సొమ్ములెల్ల గుప్పిరి దేవునికి ॥పులు॥ 3

పెదతిరుమల. శృ. సం 94 ఱే.


శంకరాభరణ


ఏమని చెప్పుదుమమ్మ యీతని సౌభాగ్యము
కోమలపు జవ్వనము గుఱుతై నట్టుండె ॥పల్లవి॥

ఒట్టుచుఁ గప్పురకాపు ఊడిగపువారెల్లా!
అట్టె దేవునికి నలఁదగాను!
దట్టముగ మంచి తెల్లఁదామెరపువ్వునకు!
ముట్టి ఆవయవములు మొలచినట్టుండె ॥ఏమని॥ 1

తనివొంద గిన్నెలతోఁ దట్టుపునుఁగులు దెచ్చి!
పొలువొంద దిరుమేనఁ బుయ్యగాను!
పనివడి గొప్పనిడుపాటినేరేడుఁబండు!
కనుపట్టు పురుషాకార మైనట్టుండె ॥ఏమని॥ 2

అలమేలుమంగ నురమందుఁ బెట్టి సొమ్ములెల్లా|
పలువిధముల నించి భావించగాను!
అలర శ్రీవేంకటేశుం డనెడి పుప్పొడిరాశి!
వెలయ మరుఁడు ముద్రవేసిన ట్లుండె ॥ఏమని॥ 3


నేఁడు స్వామినామపుఁగర్పూరచూర్ణమును తిలకపుఁగస్తూరిని బునుఁగుతైలమునుగలపి శ్రీపాదరేణు వని వేఱుగాను అభిషేకపుసుగంధి తీర్థమును బాదతీర్థ మనివేఱుగాను భకులకుఁ బ్రసాదించుట జరుగుచున్నది. రేవణూరి వేంకటాచార్యుఁడు రచించిన శ్రీపాదరేణుమాహాత్మ్యమున స్వామి మే నెల్ల మేదించిన, మేదించుటలో శ్రీపాదము లందుఁ దొరిగిన, కర్పూరధూళితోడ పునుఁగుతైలమును, దన్మిశ్రమయిన పాదతీర్ధమును శ్రీపాదరేణు నామమునఁ బ్రస్తుతిగన్నది.