34
శ్రీరాగము
ఒకపరి కొకపరి కొయ్యారమై మొకమునం గళలెల్లా మొలచినటుండె ||పల్లవి||
జగదేకపతిమేనఁ జల్లినకర్పూరధూళి! జిగిగొని నలువంకఁ జిందగాను! మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనుక! పొగరు వెన్నెల దిగఁబోసినట్లుండె ||ఒక|| 1
పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసినతట్టు పునుఁగు! కరఁగు యిరుదెసలఁగారఁగాను! కరిగమన విభుఁడు గనక మోహమదము! తొరిగి సామజసరి దొలఁకిన ట్లుండె ||ఒక|| 2
మెఱయ శ్రీ వేంకటేశుమేన సింగారముగాను! తఱచయినసొమ్ములు ధరియించఁగా! మెఱఁగుఁబోడి యలమేలుమంగయుఁ దాను ! మెఱుపు మేఘముగూడి మెఱసిన ట్లుండె ||ఒక|| 3
శ్రీ రాగము
పులుగడిగినయట్టి పురుషోత్తముఁడు వాఁడే ఎలమి నారతులు మీ రెత్తరే దేవునికి ||పల్లవి||
గొప్పయింద్రనీలాలకొండ మంచు గప్పినటు! నెప్పు మింట పాలవెల్లి నెరసినట్టు! విప్పు నీలమేఘముపై వెన్నెల గాసినయట్టు! కప్పరధూళి మేనఁ గప్పిరి దేవునికి ||పులు|| 1
నిండు నైరావతముపై నీలిజగ గప్పినట! వెండిమేడపైఁ జీఁకటి విడిసినటు! పుండరీకపుఁగొలను పారిఁ దేం ట్లూఁగినటు! మెండగు తట్టుపునుఁగు మెత్తిరి దేవునికి ||పులు|| 2