Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

లిందుబింబము హసియించునెమ్మోము తెలిదమ్మికన్నులుఁ దిలనాసికంబుఁ దెలిమించునాణిముత్తియపునామంబు కనకపిప్పలదళ కలిత పట్టంబు ననుపమమణిమయం బగుకిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథు." పరమయో 2అశ్వా.

పైయన్నింటను స్వామిముఖమున ముత్యాలనామ మున్నట్లు వర్ణన మున్నది, అది యాభరణరూపము.

స్వామికి శుక్రవారమునాఁటి తిరుమజ్జనోత్సవమును అన్నమయయుఁ దత్పుత్రులును బదింబదిగా వర్ణించిరి.

అది యినాఁట నిట్లు సాగుచున్నది:- పునుఁగుతైలపుటభ్యంజ నమును క్షీరఘటాభిషేకమును కుంకుమపూవు, కస్తురి, కప్రము, నూఱి బంగరు గిన్నెలనించిన యునుకుతో నలుఁగును న్వల్ప జలాభిషేకమును అనుకు నలుఁగుతో గలసిన యీతీర్ధము స్వామి పాదతీర్థముగా సేకరమయిన మీఁద విరివిగా జలాభిషేకమును జరుగును. తలకుఁ దడియారఁగాఁ బొడివలువ పిడిచుట్టు చుట్టి దివ్యమంగళ విగ్రహము నెల్లఁ బొడివలువతో దుడిచి నీరు పూఁతగా ముఖమున దూమెఱుఁగుగా సర్వాంగమున పునుఁగు తైలముపూఁత ముఖమునఁ గర్పూర చూర్ణముతో నామము సాఁతుట యానామమునకు నడుమఁ గస్తూరీ తిలకము దిద్దుట అలమేల్మంగ హారము (మంగతాళి) మొదలగు దివ్యాభరణములను పీతకౌశేయములను ధరింపించుట జరగును. తాళ్లపాకవారినాఁట నిట్లు సాగెడిది:-

ఆపాదమస్తకము వునుఁగు తైలవుటభ్యంజనముచేసి కుంకుమపూవు మొదలుగువాని యనుకుతో నలుఁగువెట్టి పన్నీటను శుద్దోదకమునను జలకమార్చి తుడిచి సర్వాంగములరదు నారఁగాఁ గర్పూరధూళిచల్లి మేదించి దానిపై నారఁగా బునుఁగు తైలమురాచి