పుట:Annamacharya Charitra Peetika.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31 బింబాధరంబు నొప్పెడు కపోలములు కంబు పోతంబు నెక్కసమాడుగళము మకరకుండలములు మణికిరీటంబు వికసితధవళారవిందనేత్రములు చల్లని చూపును జారునాసికము తెల్లని మెఱుఁగు ముత్తియపు నామమును గలిగి యెంతయును శృంగారభావంబు మలయు నయ్యలమేలుమంగా మనోజు. పరమయో 8 ఆశ్వా. బంగారుగజ్జెలుఁ బసిండియందియలు జెంగావిచాయమించినపైఁడి వలువ మొగవులమొలనూలు ముత్యాలకుచ్చు బిగిసి చూపటుముప్పిడికఠారంబుఁ గటి ఘటియించిన కరపల్లవంబుఁ బటువరంబుల నిచ్చు పాణి పద్మంబు వలమురి నెరవాఁడి వలయపుఁగత్తి బలసి చూపట్టెడు పాణియుగ్మమును బొడమానికము కెంపులబిటారించు నొడ్డాణమును మించును దరబంధంబు భుజకీర్తులును బాహంపురులు తాయెతులు యక్కుననెలకొన్నయలమేలుమంగ యక్కజంబగువైజయంతిసరంబుఁ దారహారములు పుత్తడిజన్నిదములుఁ జారుమయోక్తికంఠసరముఁ బేరురము కంబుకంధరమును గౌస్తుభమణియు బింబాధరంబు నొప్పెడికపోలము మందస్మితంబును మకరకుండలము