Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3O

జనుదెంచి గారుడస్తంభంబు చక్కి వినతుఁడై చెంతఁ గొవ్విరిసాల కేఁగి వలనొప్ప చంపకావరణంబు వేగ వలచుట్టి వచ్చి యాస్వామి పుష్కరిణి తోయంబు లాని యుత్తుంగభామున నాయుహికులపతి యువతారమగుచుఁ దిరుగనిచింతలం దెఱలించు నీడ తిరుగనిచింత కెంతే భక్తి మొక్కి రమణ రెండవ గోపురము దాఁటి లోని కమల మహానసాగార సేవించి నెలకొని యూనందనిలయూఖ్య మగుచు నలువొందు మణి విమానంబు సేవించి పటు మహామణి మంటపంబు సేవించి యట వచ్చి తురగతార్ క్ష్యాహినాయకుల సేవించి నిత్యుల సేవించి కూర్మి నావేళ లోనికి నరుదెంచి యచటి పంచాస్త్రకోటుల భావంబు మించి పంచవిగ్రహముల భాసిల్లి పసిఁడి గజ్జెలు నందియల్ కనకాంబరంబు గొజ్జంగిముత్యాలకుచ్చుకటారి బెడఁగుగాఁ గటిమీఁద బెరసినకేలు నుడుగక వరముల నొసగుకెంగేలు నుదరబంధంబు కేయూరహారములుఁ బొదలుతావుల తట్టుపునుఁగు పైపూఁత కుడి రొమ్ముమచ్చ యక్కున నెలకొన్న కడలికన్నియదివ్యకంఠసరంబు ధళధళదులకించు దరము చక్రంబు బలసి చూపట్టెడుపాణి పద్మములు