29
శ్రీవెంకటపతి నీవైతే మముఁ జేకొనివున్నదైవ మని! యీవల నే నీశరణనియెద నిదియె పరతత్వము నాకు ||ఎంత|| 3
అన్న అధ్యా. 179 ఱేకు
బౌళి
ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను ఏమఱక కొలచిన నితఁడే దైవము ||పల్లవి||
ఘనముగా నిందఱికిఁ గన్నులిచ్చుఁ గాళ్ళిచ్చు! పని సేయఁజేతు లిచ్చు బలియుఁడై! తనుఁ గొలువు మని చిత్తము లిచ్చుఁ గరుణించి! వొనర లోకాన కెల్ల నొక్కఁడే దైవము ||ఏమి|| 1
మచ్చిక తనుఁ గొలువ మనసిచ్చు మాట లిచ్చు! కుచ్చితములేని కొడుకుల నిచ్చును! చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు! నిచ్చలు లోకాన కెల్ల నిజమైన దైవము ||ఏమి|| 2
వంతమూడి కొలచినఁ బ్రాణ మిచ్చు ప్రాయమిచ్చు! యెంతటిపదవులైన నిట్టె యిచ్చు! వింతవింత విభవాల వెంకటేశుం డిదేమో! యంతరంగమున నుండే అరచేతిదైవము ||ఏమి|| 3
అన్న. అధ్యా.128 ఱేకు.
స్వామిదర్శనము (చూ.22.పుట) ఇక్కడి వర్ణనమువంటిదే పరమ యోగివిలాసమునను స్వామివర్ణన మున్నది.
ఆవరణంబుల కొదియై మిగులఁ గొమరారు వైకుంఠగోపురంబునకుఁ బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంతఁ