Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28




     వుట్టుకోఁగఁ దెలిసె మీనేమములు!
దండిగ సంపంగిమాఁకుల నడిపించ
     దైవరాయ తెలిసె మీవిద్యలు ॥ఎటు॥ 2

మును దాసు తిమ్మన్న తుంబురుకొండకు
     మోక్ష మియ్యఁగా దెలిసె మీబుద్దులు!
పనివడి తాళ్ళపాక అన్నమయ్యగారి
     పదములలోఁ దెలిసె మీవోజలు!
యెనయ శ్రీవెంకటనాథ యలమేల్మంగ
     నెద నుంచఁగాఁ దెలిసె మీగోప్యము!
వెనుకొని పరుషవారి కెదురు వోయి
     వెంటరాఁగాఁ దెలిసె మీరాజసము ॥ఎటు॥ 3

శేషా. వ్రాఁతప్రతి.


బౌళి


ఎంతమాత్రమున నెవ్వరు దలఁచిన అంతమాత్రమె నీవూ
అంతరాంతరము లెంచి చూడఁ బిండంతె నిప్పటి యన్నట్లూ ॥ప॥

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుం డని!
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మ మనుచు!
తలఁతురు మిము శైవులు తగినభక్తులను శివుఁ డనుచు!
అలరి పొగుడుదురు కాపాలికులు ఆదిభైరవుఁ డనుచు ॥ఎంత॥ 1

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీ వనుచు!
దరిసెనముల మిము నానావిధులను తలఁపులకొలఁదుల భజింతురు!
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలఁచినవారికి నల్పం బవుదువు!
గరిమల మిముమే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు ॥ఎంత॥ 2

నీవలనఁ గొఱఁత లేదు మఱి నీరుకొలంది తామరవు!
ఆవల భాగీరథిదరిబావుల అజలమే వూరినయట్లు!