27
మొనసి జలనిధి యమ్ముమొనకుఁ దెచ్చినచేయి!
యెనయ నాఁగేలు ధరియించుచేయి ॥ఇందు॥ 2
పురసతుల మానముల పొల్లచేసినచేయి!
తురగంబుఁ బరపెడిదొడ్డచేయి!
తిరువెంకటాచలాధీశుఁడై మోక్షంబు!
తెరువు ప్రానుల కెల్లఁ దెలిపెడిచేయి ॥ఇందు॥ 3
IIవాల్యుం 215 పుట.
స్వామిమహిమలు
శంకరాభరణం పల్లవి
ఎటువంటివాఁడవో నీమహిమ
లెట్టుదెలియవచ్చును!
నిటలలోచనుఁడు అజుఁడు తెలియలేరు
ని న్నెట్లుదెలిసేరు మానవులు ॥పల్లవి॥
తిరుమలనంబి తాతాత యన్ననాఁడె
తెలిసెఁబో మీపెద్దతనములు!
కురువనంబిగారి చేతిబంకమట్టి పువ్వులు
కొన్ననాఁడె తెలిసె మీభోగము!
మఱియు ననంతాళువారి చెఱువుగట్ట
మున్ను మోయంగా దెలిసె మీనటనలు!
గరుడగంభముకాడ కాసు కొక్కవరమిచ్చి
గడియించఁ దెలిసె మీసంపద ॥ఎటు॥ 1
తొండమాంజక్రవర్తికి సంపద
తొలుత నియ్యగాఁదెలిసె మీయీవులు!
అండయెఱుకువారి కొఱ్ఱచేనియెన్ను
లారగించగాఁ దెలిసె మీరుచులు!
వుండి గొల్లలకావిళ్ళపాలెల్ల