Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24




అనయము శ్రీ వెంకటాద్రిదేవునిబంటు!
వెనుబలమై యున్నాఁడు విట్టలములోనను ॥మొక్కరో॥ 3

అన్న అధ్యా. 252 ఱేకు.


ప్రసాదములు

దేసాక్షి


ఏపొద్దు చూచిన దేవుఁ డిట్గానె యారగించు
రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెనూ ॥పల్లవి॥

మేరుమందరాలవలె మెఱయు నిడ్డెనలు!
సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు!
ఆరని రాజాన్నాలు అందుపై వడ్డించఁగాను!
బోరన చుక్కలు రాసివోసినట్లుండెను ॥ఏపొద్దు॥ 1

పలుజలధులవంటి పైఁడివెండి గిన్నెలు!
వెలిఁగొండ లంతలేసి వెన్నముద్దలు!
బలసిన చిలువాలు పంచదార గుప్పఁగాను!
అలరువెన్నెల రస మందిచ్చిన ట్లుండెను ॥ఏపొద్దు॥ 2
 
పండిన పంటలవంటి పచ్చళ్లుఁగూరలును!
వండి యలమేలుమంగ వడ్డించగాఁ!
అండనె శ్రీవెంకటేశుఁ డారగించి మిగులఁగ!
దండిగా దాసులకెల్ల దాఁచిన ట్లుండెను ॥ఏపొద్దు॥ 3

అన్న అధ్యా. 252 ఱేకు.


స్వామి దర్శనము

శంకరాభరణం, అటతాళం


పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
నెడయకవయ్య కోనేటిరాయఁడా ॥పల్లవి॥