23
నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద!
దేవతలఁ గనిపించే దేవుండవు!
యేవంక విచ్చేసినాను యిందిరాసతికి నిజ!
సేవకుండవు నీవేకా సేనమొదలారి ॥నీవేకా॥ 1
పసిఁడిబద్దలవారు పదిగోట్లు గొలువ!
దెసలఁ బంపులు పంపే ధీరుఁడవు!
వనముగా ముజ్జగాలవారి నిందఱిని నీ!
సిసువులఁగా నేలినసేనమొదలారి ॥నీవేకా॥ 2
దొరలైనయసురులఁ దుత్తుమురుసేసి జగ!
మిరవుగా నేలితి వేకరాజ్యమై!
పరగుసూత్రవతిపతివై వెంకటవిభు!
సిరులపెన్నిధి నీవె సేనమొదలారి ॥నీవేకా॥ 3
అన్న అధ్యా. 42 ఱేకు.
హనుమంతుఁడు
సాళంగనాట
మొక్కరో మొక్కరో వాఁడె ముందర నిలుచున్నాఁడు!
యెక్కువ రామునిబంటు యేకాంగవీరుఁడు ॥పల్లవి॥
పెట్టినజంగతోడి పెద్దహనుమంతుఁడు!
పట్టెను యెడమచేత బలుముష్టి!
మెట్టినాఁడు పాదముల మించురాకాసితలలు!
కొట్టే ననుచు నెత్తె గొప్పవలకేలు ॥మొక్కరో॥ 1
వంచెను శిరసుమీఁద వాలుగాఁ దనతోఁక!
పెంచెను మిన్నులు మోవఁ బెనుదేహము!
నించినాఁడు రౌద్రము నిడుపాటిదవుడల!
కాంచనపుఁబట్టుకాసె కడు బిగించెను ॥మొక్కరో॥ 2
పెనఁచి తొడలుదాఁక పెద్దపదకము వేసె!
తనువుపై వ్రేలాడేదండలతోడ!