22 నరసింహుని జనార్ధనుని అలమేలుమంగను యాగశాలను ఆనంద నిలయమును కళ్యాణ మంటపమును బంగారుగరుడుని శేషుని వునుఁగు చట్టలను కాచి తైలము వడియుఁ గార్చు వ్రదేశమును స్వామినినుతించుచిలుకల పంజరవులను శ్రీభండారమును బంగారుగాదెలను బంగారువాకిటిని దర్శించి స్తుతించి లోనికి స్వామిని సేవింప నరిగెను. ఈసందర్భములలోఁబెక్కింటికి సంకీర్తనము లున్నవి.
దేవాలయప్రవేశము
పాడి
సేవించి చేకొన్న నారి చేతిభాగ్యము! వేవేగ రారో రక్షించి విషుఁ డీడను ||పల్లవి||
గరుడగంభముకాడ కడుఁ బ్రాణాచారులకు! వరము లొసఁగీని శ్రీవల్లభుండు! తిరమై కోనేటిచెంతఁ దీర్ధఫలము లెల్ల! పరుషల కొసఁగీని పరమాత్ముడు ||సేవించి|| 1
సేన మొదలారివద్ద చిత్తములో సుజ్ఞానము! నానాగతిఁ బుట్టించీని నారాయణుండు! కానుక పైఁడిగాదెలకాడ నిజరూపు! ఆనుక పొడచూపీని అఖిలేశుఁడు ||సేవించి|| 2
సన్నిధి గర్భగృహాన చనవిచ్చి మాటలాడి! విన్నపాలు వినీ శ్రీవేంకటేశుఁడు! ఎన్నికం బాదాలవద్ద ఇహము పరముఁ జూపీ! మన్ననల నలమేలుమంగవిభుఁడు ||సేవించి|| 3 అన్న అధ్యా. 288 ఱేకు.
వివ్వక్సేనుఁడు
నీవేకా చెప్పఁ జూప నీవేకా! శ్రీవిభుప్రతినిధివి సేన మొదలారి ||పల్లవి||