21 అన్నమయ కొండ నెక్కి స్వామిపుష్కరిణిని దర్శించి తొలుత నందు స్నానముచేసినాఁడు. అప్పడు పుష్కరిణి నిట్లు ధ్యానించినాఁడు. (18 పుట చూ.)
స్వామివుష్కరిణి
గుండక్రియ
దేవుని కిదే వునికి నీ తెప్పల కోనేరమ్మ! వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా ||ప్లలవి||
ధర్మార్ధకామమోక్షతతులు నీసోబనాలు! అర్మిలి నాలుగువేదా లదే నీదరులు! నిర్మలపు నీజలము నిండు సప్తసాగరాలు! కూర్మము నీలోఁతువో కోనేరమ్మా ||దేవు|| 1
తగిన గంగాదితీర్ధములు నీకడళ్ళు! జగతి దేవతలు నీజలజంతులు! గగనపుఁ బుణ్యలోకాలు నీదరిమేడలు! మొగి నీచుట్టుమాఁకులు మును లోయమ్మా ||దేవు|| 2
వైకుంఠనగరమువాకిలే నీ యాకారము! చేకొను పుణ్యములే నీజీవభావము! యేకడను శ్రీవేంకటేశుండె నీవునికి! దీకొని నీ తీర్థ మాడితిమి కావంవమ్మా ||దేవు|| 3 అన్న అధ్యా. 186 ఱేకు.
పెద్దగోపురమును నీడతిరుగనిచింతచెట్టును[1] గరుడగంభమును చంపకప్రదక్షణమును దివ్యప్రసాదము లొసఁగుప్రదేశమును అక్కడి ప్రసాదములను నడగోవురమును శ్రీనివాసుని భాష్యకారులను
- ↑ ఈచింత చెట్టు శేషాంశమట. సేవాక్రమమునను వెంకటాచలమాహాత్మ్యమునను పరమయోగివిలాసమునను నీచింతచెట్టుస్తుతికలదు. ఈచెట్టు నేఁడులేదు కాని సేవా క్రమమున పర్వతారోహణోపక్రమమునఁగూడ నొకచింత చెట్టున్నట్టు వర్ణన మున్నది. ఆ చింతచెట్టు నేఁడును గలదు.