15
ఆహిరి
తోరణములే త్రో వెల్లా! మూరట బారట ముంచినలతల ||పల్లవి|| కూరిమి మటములు గోపురంబులును! తేరుపడగలే తెరు వెల్లా! కోరినపండు గురిసేటి తరువులు! తోరములైన వెదురుజొంపములు ||తోర|| 1
ఆటలుఁ దిరువులు నందపు టురువులు! పాటలు వనవైభవ మెల్లా! కూటువనెమిళ్ళ కోవిలగుంపులు! పేటలఁ దేటల పెనుఁగూటములును ||తోర|| 2
వింజామరలును విసనకఱ్ఱలును! గొంజెగొడుగులె కొండెల్లా! అంజనగిరిరాయఁడు వెంకటపతి! సంజీవని పరుషల కొదవఁగను ||తోర|| 3 అన్న అధ్యా, 20 టేకు.
అన్నమయ దిగువ తిరుపతినుండి వేకువజామున బయలుదేరి అడిపడి నరసింహుని, తలయేరుగుండును, పెద్దయెక్కుడును, కపురపుఁ గాలువను, దర్శించుచు జామెక్కుసరికి మోకాళ్ళ ముడుపుకడకేగెను.
తలయేరుగుండు
అడిపడిదగ్గఱనే గొప్పచింతచెట్టు నేఁడును గలదు. శ్రీవేంకటేశ సేవాక్రమమున నది ప్రస్తుతిగన్నది. అన్నమాచార్యుఁడు దీనిఁబేర్కొన్నట్టు లేదు.
చించా మున్నిద్రసుభగాం దివ్యాం తన్మూలత శుభే! శ్రీనివాసపదాంభోజే స్వసంకల్పాత్ సముత్థితే తన్మూలత స్ప్వయంవ్యక్తా౯ సరోయోగిముఖానపి! లక్ష్మీనృసింహం శేషాద్రిం ప్రణిపత్య కృతాంజలి: ||సేవాక్రమః||