Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14




అదివో నిత్యనివాస మఖిలమునులకు!
నదె చూడుఁ డదె మ్రొక్కుఁ డానందమయము ॥అది॥ 1

చెంగట నల్లదివో శేషాచలము!
నింగి నున్న దేవతల నిజవాసము!
ముంగిట నల్లదివో మూలనున్నధనము!
బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము ॥అది॥ 2

కైవల్యపదము వేంకటనగ మదివో!
శ్రీవెంకటపతికి సిరు లయినది!
భావింప సకలసంపదలరూప మదివో
పావనముల కెల్లఁ బావనమయము ॥అది॥ 3

అన్న. అధ్యా, 4 ఱేకు.


రామక్రియ


     కట్టెదుర వైకుంఠము కాణా చయినకొండ!
     తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ ॥పల్లవి॥

వేదములే శిలలై వెలసినది కొండ!
యేదెసఁ బుణ్యరాసులే యేఱులైనది కొండ!
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ!
శ్రీదేవుఁ డుండేటి శేషాద్రి యీకొండ ॥కట్టె॥ 1

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ!
నిర్వహించి జలధులే నిట్టచఱులైన కొండ!
వుర్విఁదపసులే తరువులై నిలిచిన కొండ!
పూర్వపు టంజనాద్రి యీపొడవాటికొండ ॥కట్టె॥ 2

వరములు కొటారుగా వక్కణించిపెంచేకొండ!
పరగులక్ష్మీ కాంతు సోబనపుఁ గొండ!
కురిసి సంపద లెల్ల గుహలనిండినకొండ!
విరివైన దిదివో శ్రీ వేంకటపుఁ గొండ ॥కట్టె॥ 3

అన్న అధ్యా. 282 ఱేకు.