Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13




చక్క నేఁగుచు నవ్వచఱి గడచి హరిఁదలఁచి
     మ్రొక్కుచును మోఁకాళ్ళ ముడుగు గడచినమీఁద!
నక్కడక్కడ వెంకటాద్రీశు సంపదలు
     అంతంతఁ గాన రాఁగాను ॥అదె॥ 3

బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును
     పొందైననానావిధంబుల వనంబులును!
నిగిడి క్రిక్కిఱిసి పండినమహావృక్షముల
     నీడలను నిలిచి నిలిచి!
గగనంబు దాఁకి శృంగారరసభరితమై
     కనకమయమైన గోపురములనుఁజెలువొంది!
జగతీధరునిదివ్యసంపదలుగల నగరు
     సరగునను గానరాఁగాను ॥అదె॥ 4

ప్రాకటంబైన పాపవినాశనములోన
     భరితమగు దురితములు పగిలిపాఱుచునుండ!
ఆకాశగంగతోయములు సోఁకిన భవము
     లంతంత వీడిపాఱఁగను!
ఈకడనుఁ గోనేట యతులు బాశుపతుల్ మును
     లెన్ననగ్గలమై వున్న వైష్ణవులలో
నేకమై తిరువెంకటాద్రీశుఁ డాదరిని
     యేప్రొద్దు విహరించఁగాను ॥అదె॥ 5

-అన్న అధ్యా. 37 ఱేకు.


శేషాద్రి దర్శనము

శ్రీరాగం


     అదివో అల్లదివో హరివాసము!
     పదివేల శేషుల పడగలమయము ॥పల్లవి॥
అదె వేంకటాచల మఖిలోన్నతము!
అదివో బ్రహ్మాదుల కపురూపము!