పుట:Annamacharya Charitra Peetika.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

103 అంతయు విషమయం బట మఱి దేవ తాంతరములు గల వననేలా! బ్రాంతిఁ బొంది యేభావము భావించి నంతటనే పుణ్యు లౌట దప్పదుగాన lవైష్ణ 1 ఎవ్వరిఁ గొలిచిన నేమిగొఱఁత మఱి యెవ్వరిఁ దలఁచిన నేమీ! అవ్వలివ్వల శ్రీహరిరూపు గాని వా! రెవ్వరు లేరని యెఱుక దోచినఁ జాలు వైష్ణ 2 అతిచంచలంబైన యూతుమ గలిగించు! కతమున బహుచిత్తగతులై యితరులఁ గొలిచిన యెడయక యనాథ పతి తిరువేంకటపతి చేకొనుఁగాక వైష్ణ! 3 అన్న అధ్యా, 6 తేకు. భూపాళం ఏకులజుఁ డేమి యెవ్వఁడైన నేమి ఆకడ నాతఁడే హరి నెఱింగినవాఁడు ||పల్లవిil పరగిన సత్యసంపన్నుఁడైన వాఁడె పరనిందసేయఁ దత్పరుఁడు గానివాఁడు! అరుదైన భూతదయానిధి యగువాఁడు పరులుఁ దానే యుని భావించువాఁడు ఏకులII 1 నిర్మలుండై యాత్మనియతిఁ గలుగువాఁడే ధర్మతత్పరబుద్ధిఁ దగిలినవాఁడు కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవనివాఁడు HఏకులII 2