పుట:Andrulasangikach025988mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "మేనికి రక్షకై మించు తాయెతులు
          దండ చేతుల రెంట ధారణచేసి"[1]

అనుటచే చేతులకుమాత్రమే కట్టుకొని రనరాదు. మొలత్రాటిలో, మెడలో కూడా కట్టుకొనుచుండిరి. అయితే క్రీ.శ. 1172 లో పల్నాటివీరుల యుద్ధకాలములో అవి యుండెనో లేక శ్రీనాథుడు ద్విపదగా నా కథను వ్రాసిన నాడుండెనో చెప్పజాలము. ఎటులయినను కాకతీయుల కాలమం దవి యుండె ననవచ్చును. తాయెతు అను శబ్దముపై అప్పకవి పెద్ద చర్చచేసి తాయి (తల్లి) శిశువునకు కట్టు 'ఎతు' రక్ష యన్నాడు, తల్లులు పిల్లలకు మాత్రమే కట్టిరా? తమకే అవసరమయిన తమ తల్లులచేతనో కృతకమాతలచేతనో కట్టించు కొనిరా? వృద్ధులు, యువకులు, తమంతకు తామే మాంత్రికులతో రక్ష లిప్పించుకొని తాయెతులను కట్టుకొనకుండిరా? ఎతు అంటే రక్షణ అనుదానికి ప్రయోగ మేదీ! తాయెతు అని వ్రాయక తాయతు అని ముద్దరాజు రామన యెట్లు వ్రాసె అది తప్పు అని యతనిపై గంతుకొనినాడు. ఈ పదము తెనుగు పదమే కాదని నా భావము.

ఇది తావీజ్ అను అరబ్బీపదమై యుండును. ఖురాన్ మంత్రాలను వ్రాసి రక్షగా తురకలు కట్టుకొందురు. దానినే మనవారు స్వీకరించినట్లున్నది.

వీరకార్యములను చేయుటకు యుద్ధమునకు బోవుటకు వీరులు 'వీరతాంబూలముల' తీసుకొనుచుండిరి.[2] దీనినే హిందీలో బీడా యెత్తుట యందురు. (బీడా=విడెము) వాపులకు మందు లెట్టివో కనుడు. వాయుతైలాలు, వావిల చివుళ్ళు, ఉమ్మెత్త, ఆముదపు చివుళ్ళు, జిల్లెడాకులు, వీటితో కాచుట మున్నగునవి చేయుచుండిరి.[3]

ఆ కాలమందు వెట్టి యుండెను. అది చాలా ప్రాచీన మయినది. సంస్కృతములోని వేష్ఠి పదమే వెట్టి, చాణక్యుని అర్థశాస్త్రమునందు వెట్టి చర్చ కలదు.

  1. పల్నాటి. పు. 17.
  2. బసవ పురాణము పు 241.
  3. బసవ పురాణము పు. 77.