Jump to content

పుట:Andrulasangikach025988mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాళ్ళకును లక్కరంగు పూసుకొనుచుండిరి. కన్నులకు కాటుకను పెట్టుకొనుచుండిరి. కాళ్ళకు 'పారాణి' పూసుకొనుచుండిరి.

దండి సంస్కృతములో స్త్రీల సొమ్ములలో "మణినూపురమేఖలా కంకణ కటక తాటంకహార" అని మాత్రమే వర్ణించెను. కేతన వర్ణనలో హెచ్చుగా భూషణములను పేర్కొనుటచే నవి తెలుగుసీమలోని సీమంతినుల సొమ్ములని భావింపవచ్చును. అత డిట్లు వర్ణించెను.

          "మట్టియ లుజ్జ్వల మణినూపురంబులు
           మొలనూలు వస్త్రముల్ ముత్తియములు
           కన్నవడంబులు గట్టినూళ్ళును సుద్ద
           సరితీగె మినుకులు సందిదండ
           అంగుళీయములు హారకంకణములు
           చేకట్టుపాలెలు చెన్నుమెఱుగు
           టాకులు సరిపెణలాలక్తకము పూత
           కాటుల తిలకంబు కమ్మపువ్వు
           లాదిగాగల మేలి ద్రవ్యముల నొప్ప
           పసదనము చేసి యుచితరూపంబు దాల్చి
           బాలచంద్రిక బోటినై పజ్జ కరిగి
           దారువర్ముని లోగిలి దరియజొచ్చి"

ఈ పద్యములో స్త్రీల మైపూతను ఆభరణములు కొంతవరకు బోధకాగలవు. "నిలువుటద్దములు" పల్నాటి యుద్ధకాలమందేయుండెను.[1] ఓరుగంటి స్త్రీలు తాటంకములు, ముత్యాల కమ్మలు, కాంచీనూపుర కంకణములు, త్రిసరములు, మొదవంక కడియములు మున్నగునవి ధరించిరి.

(క్రీడాభిరామము)

వివిధములు

"తాయెతులు" రక్షగా కట్టుకొనుట ఆనాటికే యాచారమై పోయెను.

  1. "నిలువు టద్దంబులు నిలిపిరి" దిశల - పల్నాటి పు. 16.