పుట:Andrulasangikach025988mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు, మూడు అని (తెనుగుమాటలలో) కొలుతురు. క్రీ.శ. 1750 ప్రాంతమందు మహారాష్ట్రములో 12 ఏండ్ల కరువురాగా లక్షల జనులు తెనుగు, కన్నడ, తమిళ ప్రాంతాలకు వలసవెళ్ళి కరువు తీరినతర్వాత తమదేశానికి తిరిగి వెళ్ళిరి. అట్టి వలసలో తెనుగు దేశమునకు పోయినవారు తెనుగువారి ఆటలను, బాలబాలిక పాటలను నేర్చుకొని వెళ్ళిరి. నేటికిని చిల్లగోడె ఆటయు అందలి తెనుగు పదాలును, పిల్లల పాటలలో తెనుగు పాటలును ప్రచారమందున్నవి." (ఈ విషయమును నాగపూరు వారగు ప్రొఫెసర్ గర్దెగారు నాకు మరాటీ సాహిత్య చరిత్ర వినిపించి తెలిపిరి).

పాచికల ఆట

పాచికలఆటను మొట్టమొదట వర్ణించిన తెనుగుకవి నాచనసోమనాథుడు. అతడు తన ఉత్తరహరివంశములో రుక్మిణీకృష్ణు లిద్దరును ఆడినట్లు వర్ణించిన పద్యము లీక్రింద నుదాహృతములు. "చతురంతాసనంబుననుండి సకలలోక నాథుండు సత్యభామకు సాక్షిపదం బొసంగి (Umpire)

రుక్మిణి సమ్ముఖంబుగా సమాసీనుండైన నద్దేవియు,

     సీ. జోగిణి గొసరి బైసుక వెట్టి పలకపై
             సారెలు పోయించి సరము చూచి
        తనకు లాగయిన నెత్తంబుగైకొని పన్ని
             పాసికల్ దాళించి పాటెరింగి
        లోహటంబులుమాని లులిగన్న బడకున్న
             పరదాళమని పోవు పలకలిచ్చి
        తప్పార్తు జూరెండు రాయంబులును గని
             వారింపకము పోటువ్రాలు గలవు
        పంతమడిగిన నీవలె భాగమింత
             బోర పెద్ద దాయంబాడి పోరుపుచ్చి
        వైచునది ధనమునకు పోవచ్చు ననుచు
             బేరుకొని పాటు తరిసరిజేసి యడిగి