పుట:Andrulasangikach025988mbp.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గిల్లదండను బిల్లంగోని, దండుగులి, చిర్రాగోనే, చిల్లగొడె అని యెన్నెన్నో పేరులతో వ్యవహరింతురు. ఇది మన క్రికెటు ఆట అనవచ్చును. ఒక జేనెడుకట్టె చిల్లను మూరెడు పొడవుండుకట్టెతో కొట్టుదురు. ఆ యాటలో పెద్దకట్టెతో కొలుతురు. ఆ కొలతకు ఒకటి రెంచు అనక కన్ను, రెండార్చి, మూలముంజి, గెరగేర, అని ఏడువరకు చెప్పుదురు. ఏడువరకు మారుపదములను ఈ యాటలోనే యేల సృష్టించిరో! బుద్ధ ఘోషకవి ఇంచుమించు 1400 ఏండ్లనాడు అతడు తన కావ్యాలలో నొకచోట "ఘటికా ఖేలనం" అని వర్ణించినాడు. ఘటిక అనగా చిన్న కర్రపుల్లను పెద్దకర్రతో కొట్టుట అని యతడు వివరించినాడు. దీనినిబట్టి మరికొన్ని ప్రాంతాలలో నీయాట యుండినట్లున్నది. మహాభారతములో కౌరవ బాలురు చిన్నగిల్లను కట్టెతో కొట్టి యాడిరి. "చిరుతలు తీరైన గొడెలు" వీటితో బాలచంద్రు డాడెను. చిరుత అన చిల్లగొడె (గోడె) అన చిల్లను కొట్టుకట్టె. పాండవ కౌరవ బాలు రాడిన గిల్లదండ యాటను భారతమం దిట్లు వర్ణించినారు.

"ద్రోణుండు హస్తినాపురంబునకు వచ్చె నప్పు డప్పురబహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందరు కందుక క్రీడాపరులై వేడుకతో నాడుచున్నంత నక్కాంచన కందుకం బొక్క నూతంబడియె" అని తెనుగు భారతములో (ఆది. 5-206) కలదు. అందు కందుకము అనుట పొరపాటునకు తావిచ్చినది. సంస్కృత మూలమం దిట్లున్నది.

        "క్రీడలతో వ్గీటయా తత్ర వీరా: షర్యచరన్ ముదా
         పపాత కూపే సా వీటా తేషాం వై క్రీడతాంతదా"

ఇచ్చట వీటశబ్దముపై మూలమం దిట్లు వివరించినారు: "వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్ హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా: ప్రాక్షిపంతి" జేనెడు కట్టెగిల్లను మూరెడు కట్టెతో కొట్టి ఆడెడు ఆటకు వీటా ఖేలన మనిరి.

మహారాష్ట్ర సాహిత్యచరిత్రలో ఇట్లు వ్రాసినారు. పూర్వము మహారాష్ట్రులలో బిల్లగోడెఆట లేకుండెను. ఆ యాట నిప్పుడు మరాటిలో "విటి దండు" (విటి-వీట, దండు-దండ), అందురు. ఈ యాటలో ఏడువరకు దండముతో కొలుచుట కలదు. ఆ యేడు సంఖ్యలను మరాటీ బాలురు ఒకటి