పుట:Andrulasangikach025988mbp.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

        "అహి పెట్టితి జొన్న గడ్దాగ్రహార వృత్తి
         ఏనూరు నూకల వృత్తమునకును."[1]

ఓరుగంటిలోని ఖాన్‌సాబ్ తోటలోని శాసనములో చిన్నముసు రెండు మూడు మారులు పేర్కొనినారు. అన్నిటికన్న చిన్న నాణెము బహుశా 'తార' మేమో. "తార మొసంగరే ధర్మాత్ములారా" అని యొక పిచ్చుకుంట బిచ్చగాడు ప్రార్థించెను.[2] మాడలు అనునవి సాధారణ వ్యవహారమున నుండు నాణెములు.

'మా కులంబున ఓలిమాడలు కలవు'

అని బాలచంద్రు డనెను. వెలమలతో ఆనాడు ఓలి యుండుట గమనింప దగినది.

తురకల పరిశ్రమ యగు 'మఖుమల్‌' బట్టలు దేశములో వ్యాప్తిలో నుండెను.[3]

ధాన్యం కొలతలలో ఇరుస, కుంచము, తూము అనునవి యుండెను.

(చూడు, బసవపురాణము, పుటలు 149, 152.)

వ్యాపారము

కాకతీయ కాలమందు వ్యాపారము చాలా అభివృద్ధి నొందెను. తూర్పు దీవులనుండి పశ్చిమ ప్రాంతాలనుండి సరకులు రాజ్యములోనికి వస్తుండెను. రేవులవద్ద సుంకములు తీసుకొనుచుండిరి. ఆ సుంకములు ప్రజలకు తెలియునట్లుగా శాసనములపై చెక్కించి యుంచిరి.

ఓరుగంటి కోటకు బయటిభాగమున మైలసంత సాగుచుండెను. అచ్చట సుంకములు నిర్ణయము చేసి శాసనముండెను. ఇప్పటికిని నందే కలదు. ఆ స్థలము నిప్పుడు ఖాన్‌సాహెబ్ తోట యందురు. ఆ శాసనమునుబట్టి యచ్చట

  1. క్రీడాభిరామము.
  2. పండితారాధ్య చరిత్ర, 2 వ భాగము, పుట 307.
  3. "మఖుమల్లుగుడ్డలు" పల్నాటి పు 10.