పుట:Andrulasangikach025988mbp.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మహారాణి రుద్రమదేవి కాలములో ప్రపంచ సంచారియగు మార్కోపోలో అను జినీవావాడు వరంగల్ రాజ్యవిశేషములను గూర్చి యిట్లు వ్రాసెను. "కాకతీయుల రాజ్యములో శ్రేష్ఠమై సన్ననైనట్టి వస్త్రములు నేయుదురు. వాని క్రయము చాలా ప్రియము. నిజముగా ఆ బట్టలు సాలెపురుగు జాలవలె నుండును. వాటిని ధరింపనొల్లని రాజుకాని, రాణికాని ప్రపంచమందుండరు."

నిర్మల కత్తులు అని ప్రసిద్ధికల కత్తులుండెను. నిర్మలకు సమీపమందుండు కూన సముద్రములో వాటిని సిద్ధము చేయుచుండిరి. నిర్మల నుండి కత్తులను ఇనుమును డెమస్కస్ (దిమిష్కు) పట్టణాని కంపుచుండిరి.

ప్రజలకు సౌకర్యములు

ఓరుగంటి రాజులు తమ ప్రజలను చక్కగా విచారించుకొన్నవారు. వారు ప్రజలను పీడించిన ట్లెందును సూచనలు లేవు. వీరశైవ బోధకుల వలన ఇతర సాంప్రాదాయకుల కేమైన నష్టకష్టములు కలిగియుండును. ఓరుగంటి రాజుల ప్రజలకు ఆరోగ్యశాలలను, ప్రసూతి గృహములను, సంస్కృతమును వేదవేదాంగములను బోధించుటకై కళాశాలలను స్థాపించిరి. శా॥

శ॥

1183లో రుద్రమదేవి వెలగపూడి అను గ్రామమును ప్రజాహితమునకై దానము చేసెను. అందు ఒక మఠమును, ఒక సత్రమును కట్టించెను. సత్రమందు వంటకై ఆర్గురు బ్రాహ్మణపాచకులేర్పాటయిరి. జనుల ఆరోగ్య విచారణకు చికిత్సలకు ఒక కాయస్థ వైద్యు నేర్పాటుచేసిరి. గ్రామరక్షణకై 10 మంది 'వీర భద్రులు' (గ్రామ భద్రతకు బాధ్యులగు వీరభటులు) ఉండిరి. 21 మంది భటులు (తలార్లు) ఉండిరి. వీరిని వీరముష్టివారని పిలుచుచుండిరి. (ఈనాడు వీరముష్టి యను నొక హీనకులము వారు కేవలము కోమట్లను యాచించి జీవింతురు. కాని ఆనాడు శబ్దార్థమును బట్టి చూడ గ్రామసేవ చేయుచు గ్రామజనుల ముష్టిదానమునకు అర్హత కలిగినవారు వీరముష్టి వారని యూహింపవచ్చును.) గ్రామములో హింసోద్భవ దుష్కార్యములను (ఫౌజ్దారీ-క్రిమినల్) చేయు వారిని అధికారుల యాజ్ఞాప్రకారము కొరడాలతో కొట్టుట లేక నానావిధములగు హింసలు పెట్టుట లేక కాలో చెయో నరకుట లేక తలనే నరకుట, యను విధులను నెరవేర్చుచుండిరి.[1] ప్రభువులే గాక వారి యధికారు

  1. మల్కాపుర శాసనము, I. A. H. R. S. సం 4, పు 147-162.