పుట:Andrulasangikach025988mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ఇప్పుడు నాగాయ్) అనుచోట ఇట్టి విద్యాపీఠ ముండెను. గోళకీమఠములన్నియు విద్యాకేంద్రములే. ఈ విధముగా రాజులు, భక్తులు, ధనికులు విద్యాసంస్థలను పోషిస్తూవుండిరి.

నేటికిని తెనుగు అక్షరాలను "ఓనమాలు" అని దేశమంతటను అందురు. శైవుల ప్రాబల్యమే తెనుగుదేశాని కుండినదనుట కీ ఓనమాలే సాక్ష్యమిస్తున్నవి. "ఓం నమ: శివాయ" అను షడక్షరీ శివమంత్రముతో విద్య ప్రారంభమగుచూ వచ్చినది. ఉత్తర హిందూస్థానములోను, మళయాళములోను "శ్రీ గణేశాయ నమ:" అని అక్షరాభ్యాసము చేతురు. కాని మన తెనుగు దేశమందును, కర్ణాట మందును ఈం నమశ్శివాయయే కాక 'సిద్ధం నమ:' అనియు వ్రాయింతురు. మొదట జైనమత వ్యాప్తియై జైనులే విద్యాబోధకు లగుటచేత వారు "ఓం నమ: సిద్ధేభ్య:" అని అక్షరాభ్యాసము చేయిస్తూ వుండిరేమో ! క్షేమేంద్రుడు తన 'కవికంఠాభరణము' అను గ్రంథములో వర్ణమాలను చమత్కారముగా శ్లోక బద్ధముచేసెను. అందు మొదటి శ్లోక మిట్లున్నది.

       "ఓం స్వస్త్యంకం స్తుమ: సిద్ధమంతర్యాద్యమితీప్సితం
        ఉద్యదూర్జపదం దేవ్యా ఋ ౠ ఌ ౡ ని గూహనం"

తుదిలో ఇట్లనెను.

       "ఏతాం నిమ: సరస్వత్యైయ: క్రియామాతృకాం జపేత్"

పై శ్లోకములో "స్తుమ: సిద్ధం" అను పదాలు గమనింపదగినవి.క్షేమేంద్రుడు కాశ్మీరకవి, కాశ్మీర శైవము తమిళ శైవముతో భిన్నించినట్టిదని తదజ్ఞుల అభిప్రాయము. ప్రాచీనములో దేశమందంతటను "ఓం నమ: శివాయ" యనియు, "ఓం స్వస్త్యంకం స్తుమ: సిద్ధం" అనియో లేక "స్తుమ: సిద్ధం" అనియో విద్యాభ్యాసము చేయుచుండిరేమో,, స్తుమ: సిద్ధం అనునదే "నమ: సిద్ధం" అని తెనుగుదేశములో మారెనేమో అని పై విషయము కూడ సూచింపనైనది.

నేను మొదటి ముద్రణములో ప్రకటించిన పై విషయమును ఒకరు ఒక సభలో నాక్షేపించుచు "సిద్ధం నమ:" అనుట వ్యాకరణశాస్త్ర విరుద్ధమని యుపన్యసించిరి. వ్యాకరణ విరుద్ధమనియు 'నమ: సిద్ధేభ్య:' అని యుండు