పుట:Andrulasangikach025988mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును వ్రాసెను. అది తంజావూరి లిఖిత పుస్తకాలలో నున్నది. కాని, దానిని ముద్రించుట కెవ్వారును పూనుకొనరయిరి. జాయప గ్రంథమునకు ఉదాహరణము లాస్తంభాలపై నాట్యముచేస్తున్న సుందరీమణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రించిన ఎంత బాగుండునోకదా!

పాలమూరుకు సమీపములో బూదుపూరు అనునది కలదు. (బహుశా అది గోన బుద్ధారెడ్డిపేర కట్టిన బుద్ధాపురము:) అందు శిథిలములయిన ఆలయములు కలవు. వాటిపై తురకల సుత్తెపోట్లు పడినవి. ఒక దేవాలయాన్ని మసీదుగా చేసుకొనిరి. ఆ మసీదులో నేటికిని శాసనా లున్నవి. వాటిని గోన బుద్ధారెడ్డి కూతురును, మల్యాలగుండ దండనాయకుని భార్యయు నగు కుప్పమ్మ కట్టించెను. కుప్పమ్మయు, గుండయ్యయు పాలమూరుజిల్లా నాగరు కర్నూలు తాలూకాలోని వర్ధమానపురము ఇప్పటి వడ్డెమానులోను కొన్ని సుందర శివాలయములను కట్టించిరి. దానికి 15 మైళ్ళ దూరమున వనపర్తి సంస్థానములోనిదగు బుద్ధాపురం అను గ్రామము కలదు. అదియు బుద్ధారెడ్డి పేర కట్టించినదే.

నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను.

కాకతీయుల కాలపు శాసనాలు ఆలంపూరులో కానవచ్చును. కాని అందు పూర్వదేవాలయములకు దానాలు చేసినట్లు కానవచ్చును. నాగుల పాటిలోను కొన్ని నిర్మాణములు కలవు. కాకతీయ శాసనములు కర్నూలు జిల్లాలోని త్రిపురాంతకములో కలవు. అందు 'విమానములు' నిర్మించినటుల తెలిపినారు. విమానములు అనగా ఎత్తయిన గోపురములు. కొండపర్తి మున్నగు ప్రాంతాలలోను నిర్మాణములు కానవస్తున్నవి.

విద్యా వ్యాపకము

కాకతీయుల కాలములో అంతకు పూర్వమందుండినటుల అనేక ప్రాంతాలలో కళాశాలలుండెను. వాటియందు మతబోధ, వేదములు, గీర్వాణభాషలోని కావ్యములు, న్యాయమీమాంసాది శాస్రములు బోధించుతూ యుండిరి. విద్యార్థుల కుచిత భోజన వసతులుండెను. వాడీ స్టేషన్ సమీపమందలి నాగవాపి