పుట:Andrulasangikach025988mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందువులు మతాంతరులను స్వీకరింపలేదని క్రీస్తుశకము అయిదవ శతాబ్దినుండి వచ్చిన కట్టుబాట్లనుండి కొంద రూహించినారు. కాని శుద్ధిచేయుట, మతాంతరుల స్వీకరించుట, మతప్రచారము చేయుట, హిందూబౌద్ధులనుండియే క్రైస్త వేస్లాములు నేర్చుకొనెను. క్రీ.పూ. 150 ఏండ్లనాడు హెలియోడోరన్ అను గ్రీకువాడు హిందువై ఖీల్సాస్టేషన్ సమీపమందలి బెస్నాగర్‌లో గరుడస్తంభ మెత్తించి శాసనము వ్రాయించి తాను భాగవతమతమును స్వీకరించినట్లు తెలుపుకొనెను. తురకలు సింధుదేశమును లాగుకొన్న తర్వాత బలవంతముగా తురకలైనవారిని శుద్దిచేసి హిందువులను చేయుటకై దేవలస్మృతి ఇంచుమించు క్రీ.శ. 11 వ శతాబ్దములో పుట్టెను. ఓరుగంటి రాజ్యమును ధ్వంసించిన కాలములో తెనుగుసీమవారును శుద్ధిసంస్కారమును తొలిసారి ప్రారంభించిరి. పిచ్చితొగ్లాకు వరంగల్‌ను జయించిన తర్వాత ఆంధ్రదేశములో చాలమందిని బలవంతముగా ముస్లిములను జేసిరి. ముఖ్యులైన ఆంధ్రులను తురకలుగా జేసి డిల్లీకి తీసుకొనిపోయిరి. అందొకడు కన్నయ నాయకుని బంధువు. ఆ నవముస్లిమును కంపిలిరాజుగా తొగ్టా కంపెను. వాడు కంపిలికివచ్చి "మహమ్మదీయ మతమును వదలిపెట్టి పితూరీ చేసెను." ఇది క్రీ.శ. 1745లో జరిగిన మాట!

సంఘ సంస్కారము

హిందూమతమును సంస్కరించు నుద్దేశముతో శైవ వైష్ణవ మతములు ప్రబలియుండెను. కాని అవి యెక్కువగా అపకారమే చేసినవి జైనులలో చాలా గొప్ప తార్కికులుండిరి. వారు వ్రాసిన సంస్కృత తార్కిక చర్చలలో కులతత్వమును చాల సుందరముగా దిట్టముగా ఖండించిరి. అట్టి జైనులవల్లనే సంఘ సంస్కారము తెనుగుదేశములో బౌద్ధులతోపాటు మొదలయ్యెను. కాకతీయ కాలములో అనులోమ ప్రతిలోమ వివాహములు చాలాజరిగెను. రుద్రమ్మరాణి బ్రాహ్మణ మంత్రియగు ఇందులూరి అన్నయ్య రుద్రమయొక్క రెండవ కూతురగు రుయ్యమ్మను వివాహమాడెను. రాజవంశమందే కులము కట్టుబాట్లులేనప్పుడు జనసామాన్యములో మాత్ర ముండునా? పల్నాటి యుద్ధములో చాపకూటిని గురించియు, బ్రహ్మనాయడు బహుకులములతో బాంధవ్యము చేయుటను గురించియు నిదివరకే చర్చింపబడినది. పాలెం అనుపదము దక్షిణమందే