పుట:Andrulasangikach025988mbp.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

(2) మైలారుదేవుడు - ఇతడు ఏకవీరవలెనే జైనదేవుడై తరువాత శైవుడయ్యెనేమో! "భైరవునితోడు జోడు మైలార దేవుడు" మైలారను గ్రామమున వెలసి మైలారుదేవు డయ్యెను.[1]

(3) ఇతర దేవతలు - భైరవుడు, చమడేశ్వరి, వీరభద్రుడు, మూసానమ్మ, కుమారస్వామి, పాండవులు, స్వయం భూదేవుడు (శివుడు) ముద్దరాలు ముసానమ్మ.[2]

(4) వీరగడ్డములు - నేటికిని చాలగ్రామములలో వీరగుడ్డమ్మలు కలవు. ఏదో వీరకృత్యము చేసియుండిన స్థానిక వీరుని పూజసేయుట ఆచారమై యుండెను. పల్నాటివీరుల యుద్ధము క్రీ.శ. 1132 ప్రాంతముదని ఉమాకాంతముగా రన్నారు. ఆ వీరుల పూజను నేటికిని పల్నాటిలో చేయుచున్నారు. ఆ యుద్ధము ముగిసిన నాటినుండియే వీరపూజ ప్రారంభమయ్యెను. ఓరుగంటిలోను,

"పలనాటి వీర పురుష పరమ దైవత శివలింగ భవన వాటి" యుండెను.[3]

       "కులము దైవతంబు గురిజాల గంగాంబ
        కలని పోతులయ్య చెలిమికాడు
        పిరికికండ లేని యరువది యేగురు
        పల్లెనాటి వీరబాంధవులకు"[4]

కలని పోతులయ్య, గురిజాల గంగమ్మ అను గ్రామ దేవతలును ఉండిరి.

(5) మాచెర్ల చెన్నడు - చెన్నకేశవుడు అను దేవత "మాచెరల చెన్నడు శ్రీగిరి లింగముం గృపాయత్తత జూడ" అన్నందున చెన్నకేశ పుడనవలెను.

పల్నాటి కథలో బాలచంద్రుని తల్లి సంతానమునకై నోచిన గజనిమ్మ నోములో చెన్నకేశవుని పూజ మాచర్లలో చేసినట్లు తెలిపినందున మాచర్ల చెన్నడు చెన్నకేశవుడే యని దృడపడినది.

  1. క్రీడాభిరామము.
  2. క్రీడాభిరామము.
  3. క్రీడాభిరామము.
  4. క్రీడాభిరామము.