పుట:Andrulasangikach025988mbp.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యిప్పుడు తెలంగాణములో, రాయలసీమలో ఎల్లమ్మదేవర అని యందురు. ఈ ఏకవీర గుడి "నింబపల్లవనికురంబ సంధానిత వందనమాలికాలంకృతద్వారము" కలది.[1]

ఓరుగంటి యెల్లమ్మ అని ప్రసిద్ధ దేవత కలదు. ఓరుగంటి నగరములో ఎల్లమ్మ బజారు అనునది కలదు. అది ప్రాచీనపుదిగా తోస్తున్నది. అయితే ఓరుగంటిలో నగ్నదేవత యగు యెల్లమ్మ విగ్రహమెం దయిన కలదో లేదో తెలియదు. కాని అట్టి విగ్రహము ఆలంపూరులో కలదు. దక్షిణ కాశి అనియు, శ్రీశైల పశ్చిమద్వార మనియు దీనికి ఖ్యాతి గలదు. నవబ్రహ్మల ఆలయములు బహు ప్రాచీనపువి అందు కలవు. అష్టాదశ శక్తులలో నొకటి యగు జోగుళాంబ అందే కలదు. అయితే జోగుల అంబ అనుటచే ఆమె జైన దేవతగా నుండి శైవమతమును బలవంతముచే పుచ్చుకొన్నదేమో! అట్టి యాలంపూరులోని బ్రహ్మేశ్వరాలయములో తలలేని మొండెము, నగ్నత్వముతో నున్న ఒక స్థూలదేవతా శిల్పమును స్థానికులు ఎల్లమ్మ యనియు, రేణుక యనియు పిలుతురు. తండ్రియాజ్ఞలచే తల్లియగు రేణుక తలను పరశురాముడు నరుకగా తల యెగిరి మాలవాడలో బడెనట. మొండెము మాత్రమే అచట నిలిచెనట. ఆమె గొడ్రాండ్రకు పిల్లల నిచ్చు దేవత యని ఆలంపురీ మాహాత్మ్య మను స్థానిక లభ్యమాన లిఖిత పుస్తకమందు వర్ణితము.

ఈ ఎల్లమ్మ కథను రేణుక కథగా నేటికిని రాయలసీమ పల్లెలలోను, పాలమూరు జిల్లాలోను బవనీండ్లు (మాదిగజాతివారు) జవనిక (జమిడిక) వాయించుచు కథగా రెండుదినాలు చెప్పుదురు. కాకతీయుల కాలమునాడును బవనీలును మాదిగ స్త్రీలును ఎల్లమ్మ కథను వీరావేశముతో చెప్పుచుండిరి. వారు మ్రోయించు జవనిక "జుక జుం జుం జుక జుం జుం జుమ్మనుచు సాగుంగడున్ వాద్యముల్"[2]

"వాద్యవైఖరి కడు నెరవాది యనగ

          ఏకవీరా మహాదేవి యెదుట నిల్చి

          పరశురాముని కథ లెల్ల ప్రౌడి పాడె

          చారుతరకీర్తి బవనీల చక్రవర్తి"

[3]
  1. క్రీడాభిరామము.
  2. క్రీడాభిరామము.
  3. క్రీడాభిరామము.