పుట:Andrulasangikach025988mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యములోని "శ్రీ యనగౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపముదాల్చి" అని వర్ణించెను. అతనివలెనే గుత్తి ప్రాంతము వాడగునాచన సోమన తన ఉత్తర హరివంశమును హరిహర నాథునికే అంకితమిచ్చెను.

నాచన సోముని కాలములో (క్రీ.శ.1300 ప్రాంతము) శైవవైష్ణవ ద్వేషా లుండినందుననే అతడిట్లు వ్రాసెను.

     మ॥
 పరివాదాస్పద వాదమోద మదిరా
                  పానంబుచే మత్తులై
          హరి మేలంచు హరుండు మేలనుచు నా
                  హ కొంద రీ పొం దెరుం
          గురు కైలాస నగంబునందు మును లే
                  కత్వంబు భావించి రా
          మురవైరం బురవైరి బాపుట మహా
                  మోహంబు ద్రోహం బగున్.[1]

విగ్రహారాధనము, వివిధ సాంప్రాదాయములు, హిందువులను భిన్నించి దుర్బలులుంగా జేసిన వనవచ్చును. సామాన్య జనులు శక్తిభేదములని అంటు జాడ్యాలకు దేవతలను ఏర్పాటుచేసిరి. భక్తులను దేవతలగా పూజించిరి. కాకతీయుల కాలములో ఈ క్రింది దేవతలను పూజిస్తూయుండిరి.

(1) ఏకవీర - ఈ దేవత శైవదేవతయై యుండును. 'కాకతమ్మకు సైదోడు ఏకవీర'[2] అని వర్ణించిన పద్యమునుబట్టి యీ దేవత రేణుక (పరశురాముని తల్లి) యని స్పష్టము. ఈమె మాహూరము అను గ్రామమున నెలకొన్నదగుటచే మాహురమ్మ యనియు పిలువబడెను. ఈదేవత నగ్నదేవత[3]. ఈమెనే

  1. ఉత్తర హరివంశము, ఆ 2, ప 68.
  2. క్రీడాభిరామము.
  3. "ఏకవీరమ్మకు మహురమ్మకు అధోహ్రీంకార మధ్యాత్మకున్" క్రీడాభిరామము.
    "వ్రీడాశూన్య కటీరమండలము దేవీశంభళీ వ్రాతమున్" క్రీడాభిరామము.