పుట:Andrulasangikach025988mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"వీరి యుద్బోధచేతనే కాబోలును ప్రతాపరుద్రుని కాలమున నాంధ్రదేశ శివాలయములో బెక్కింట తమ్మళ్ళు తొలగింపబడి వెలనాటి వారు పూజారుగా నిలుపబడిరి."[1]

"దేవళములం దర్చకులుగా నుండు తంబళ్ళకు 'జియ్యలు' అని వ్యవహారము."[2] పూర్వము శివాలయము లన్నింటిలో తమ్మళ్ళు పూజారులుగా నుండిరి.

        "మును శివు డిచట బుట్టిననాట నుండి
         చెనసి తమ్మళి భజించిన చొప్పులేదు"

అని యొక భక్తుడు వాపోయెను. నేటికిని కొన్ని శివాలయములలో తంబళ్ళే పూజారులైనారు.

కాకతి గణపతిరాజు గోళకీమఠమునకు చెందిన విశ్వేశ్వర శివాచార్యులవద్ద శివదీక్ష పొంది గోళకీమఠమును కృష్ణాతీరమందలి 'మందడ' గ్రామమున నెలకొల్పెను. విశ్వేశ్వరుడు విద్యామంటపవర్తి" [3][4] [5]

"మందడు గ్రామభోక్త అయి దక్షిణరాడానుండి వచ్చిన కాలాముఖుల తోడ్పాటుతో వెలగపూడి మఠాదుల్లో విద్యాశాలలు సాగించి ఆంధ్రదేశములో విజ్ఞానాన్ని వ్యాపింపజేసిన విశ్వేశ్వర శైవాచార్యులవంటి విద్యాసంపన్నులు ఈ కాకతీయుల కాలములోనే వర్థిల్ల గలిగినారు. కాకతీయ గణపతిదేవుడు గణపేశ్వర దేవాలయము కట్టించి అక్కడ అనేకులను విద్వాంసులను స్థాపించాడని కుమారస్వామి తెలుపుతున్నాడు. వీరినే "రాజన్నేతే గణపేశ్వరసూరయ:" (ప్రతాపరుద్రీయం) అనేచోట గణపేశ్వర సూరులని విద్యానాథుడు పేర్కొన్నాడు".

కాకతీయుల కాలములోనే కొన్ని ప్రాంతలలో శైవ వైష్ణవ సమన్వయమునకై కాబోలును హరిహరమూర్తి పూజలు జరుగుచుండెను. నెల్లూరిలో అట్టి మూర్తి యుండె నందురు. తిక్కన సోమయాజి తన భారతములోని మొదటి

  1. వే. ప్రభాకరశాస్త్రి బసవపురాణ పీఠిక, పు 76.
  2. పుట 114
  3. బసవపురాణము (పాల్కురికి) పు 73.
  4. వే. ప్ర. శాస్త్రిగారి పీఠిక. పు 75
  5. పల్నాటి వీరచరిత్ర; ద్వితీయ భూమిక, అక్కిరాజు ఉమాకాంతం గారి పీఠిక.