పుట:Andrulasangikach025988mbp.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యని యీ జాతీయ కళాశాల నిరూపించెను. పూర్వకాలపు చిత్రలేఖన పద్ధతిమారెను. రంగులు మారెను. భావాలు మారెను. తెనుగుదేశమందు నూతన చిత్రలేఖన పద్ధతి కీ కళాశాలయే దోహద మిచ్చినట్టిది.

ముసల్మాను ప్రభువులలో గోలకొండ సుల్తానులలో ఒక్క ఇబ్రహీం ఖుతుబ్షాయు, అతని యుద్యోగియగు అమీను ఖానున్నూ తెనుగు భాషను పోషించిరి. ఆసఫ్‌జా వంశమువారు తెనుగు నాదరించకపోగా దానికి నిఘాతములే కల్పించిన వారయిరి. తెనుగుదేశాన్ని పాలించిన యీ ఖుతుబ్షా ఆసఫ్‌జా వంశాలవల్ల తెనుగుభాష కేమిన్ని సహాయము కలుగలేదు. ఇంగ్లీషు పరిపాలనలో ఇంగ్లీషు ప్రభుత్వము దేశములోని తాటాకు గ్రంథాలను సేకరించి మద్రాసులో ప్రాచ్యలిఖిత పుస్తకాలయమును స్థాపించి, అందు వాటినుంచి అంతరించిపోనున్న బహు గ్రంథాలను రక్షించిరి. పలువురు ఇంగ్లీషు వారు మన భాషను నేర్చుకొనిరి. అందు బ్రౌన్ ముఖ్యుడు. ఖుతుబ్షాలు, అసఫ్‌జాలు అందరినీ ఒక్క ప్రక్కపెట్తి బ్రౌనుదొర నొక్కదిక్కు పెట్టి తూచిన బ్రౌను దిక్కే త్రాసు ముల్లు సూపును. అతడు తాటాకు గ్రంథాలు సేకరించియుంచెను. వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెనుగు నిఘంటువులు రెండు రచించెను. అందొకటి వ్యావహారిక పదకోశము. నేటికిని ఇవి చాలా యుపయోగపడుచున్నవి. మెకంజీ అను నింకొకడు కైఫీయత్తులను వ్రాయించి తెప్పించియుంచెను. కాల్డ్వెల్ అను మరొకడు ద్రావిడ భాషాశాస్త్రమును వ్రాసెను. మొత్తముపై ఇంగ్లీషు భాషాప్రభావము తెనుగుభాషపై సంపూర్ణముగా పడెను. తెనుగులో బహుముఖ వికాసము కలిగెను. ఇంగ్లీషు వారు భాషతోపాటు ప్రాచీన శిల్పములను కాపాడిరి. తురకలు విధ్వంసము చేసిరి. ఇంగ్లీషువా రుద్ధరించిరి. హంపీ శిథిలాలను, అమరావతీ స్తూపాలను, ఇతర ప్రాచీన దేవాలయాలను కోటలను మరమ్మతుచేసి, దిబ్బలు త్రవ్వి, శిల్పశకలాలను బయటికితీసి, మిగిలినవాటిని విధ్వంసము కాకుండా రక్షించిరి. బ్రిటిషిండియాలోని యీవిదానమును హైదరాబాదులో అవలంబించక తప్పినదికాదు. అందుచేత తెనుగుసీమ హద్దు వరకు ఓరుగల్లు శిథిలాలు, రామప్ప గుళ్లు, పిల్లలమర్రి, పానుగల్లు (నల్లగొండ) మున్నగు తావులలోని తెనుగు శిల్పాలను రక్షింపవలసినవారయిరి.

1857 విప్లవానంతరము తెనుగుసీమలో ఉత్తర సర్కారులలోనే యెక్కువగా పురోభివృద్ధి కలిగినది. వారికంటే రాయలసీమవారు వెనుకబడిన