పుట:Andrulasangikach025988mbp.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"భాషాభివృద్ధికి గద్య గ్రంథము లత్యంతావశ్యకంబులని మొట్టమొదట కనిపెట్టినది చిన్నయసూరి; అతడు గద్యనన్నయ. రెండవవారు కం. వీరేశలింగము; వారు గద్యతిక్కన, పూర్వ మొకప్పుడుండిన పురుషార్థ ప్రదాయిని, ఆంధ్ర భాషాసంజీవని, మందార మంజరి, చింతామణి, శ్రీ వైజయంతి, మొదలైన మాసపత్రికలును, ప్రస్తుతమున్న సరస్వతి, మంజువాణి, మనోరమ, సువర్ణలేఖ, సావిత్రి, హిందూ సుందరి, జనానా పత్రిక మొదలగు మాసపత్రికలు, ఆంధ్రప్రకాసిక, శశిలేఖ, కృష్ణా పత్రిక, ఆర్యమతబోదిని, సత్యవాది, మొదలగు వార్తాపత్రికలును తెనుగునం దొకవిధమైన యుపయోగకరమగు వాఙ్మయమును పుట్టించినవి. కాని తెలుగుబాస యొక నాగరికభాష యనిపించు కొనుటకు ఇపుడు జరిగిన ప్రయత్న మొక సహప్రాంశమెనను కాదు" మన భాషలో చరిత్రలు, కథలు, శాస్త్ర (సైన్సు) గ్రంథాలు ఏవియు లేవని వారు వాపోయిరి. ఆ యుత్తమ పీఠిక అత్యంతముగా విలువయైనట్టిది. వారెత్తిచూపిన లోపాలను తొలగించుటకై విజ్ఞాన చంద్రికా గ్రంథమాలా ద్వారా చాలా కృషిచేసి. సిద్ధ సంకల్పులైరి. మన దురదృష్టము చేత వారు 1922 లోనే మరణించిరి. వారి యనంతరము గ్రంథమాల నానాటికి తీసికట్టుగా సన్నగిలి మాయమైపోయెను.

1900 నుండి తెనుగులో ఇంగ్లీషు సంస్కృత పద్దతులపై నాటకాలు, నవలలు, వచన గ్రంథాలు, చరిత్రలు, విమర్శలు, ఖండకావ్యాలు, విరివిగా రచింపబడుతూవచ్చెను.

బెంగాలును కర్జన్ వైస్రాయి రెండు బాగాలుగా విభజించెను. హిందూ ముస్లిములను భిన్నించుటకై అత డట్లు చేసెను. అందుపై బెంగాలులో జాతీయోద్యమము తీవ్రరూపము దాల్చెను. వందేమాతరం జాతీయ గీతమయ్యెను. హింసాత్మక చర్యలతో బెంగాలీలు ప్రతిఘటించిరి. ఆ జాతీయోద్యమపు గాలి తూర్పుతీర మందలి ఉత్తర సర్కారులను తెనుగు జిల్లాలపై వీచెను. ఆ సందర్బములో "స్వదేశీ" విధానోద్యమము బయలుదేరెను. అదే సందర్బములో బందరులో జాతీయ కళాశాల స్థాపితమయ్యెను. అదొక ముఖ్యఘట్టము. మన పూర్వ సంస్కృతి యంతయు గర్వింపదగినది కాదనియు ఇంగ్లీషువారి దంతయు ఉత్తమమనియు భావించిన వారిలో కొంత పరివర్తనము కలిగెను. మన సంస్కృతిని కాపాడుకొనుచు కాలానుసరణమగు మార్పులు చేసుకొనుటయే సరి