పుట:Andrulasangikach025988mbp.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముద్రించినారు. నావద్ద 50 ఏండ్లక్రిందటి ముద్రిత ప్రతి కలదు. నా ప్రతిలో ఎక్కువభాగాలు, భిన్నపాఠాలు కలవు. రెంటిని కలిపి సమన్వయించి పీఠికతో కర్నూలు వ్యవహారికమున కర్థాలతో ముద్రించుట అవసరము.

3. India under Early British Rule R. C. Dutt

4. V. Smith-Oxford History of India

5. కూచిమంచి తిమ్మకవి:- కుక్కుటేశ్వర శతకము. ఇతడు బహు గ్రంథాలు వ్రాసినాడు. కాని అన్నియు పిచ్చిపిచ్చి పాతకాలపు అష్టాదశ వర్ణనలే, ఇదొక శతకమే మనకు కాస్త పనికివచ్చేది.

6. గువ్వల చెన్నశతకము:- ఇది చాలా పనికివచ్చునట్టిది.

7. ఏనుగుల వీరాస్వామి:- కాశీయాత్ర చరిత్ర. ఇతడు నవీన పాశ్చాత్య పద్ధతిని ఇంగ్లీషు మిత్రుల ప్రోత్సాహముతో ప్రవేశ పెట్టెను. ఇది అతని యాత్రకు సంబంధించిన డైరీ (దినచర్య). 100 ఏండ్లక్రిందటి మద్రాసు తెనుగున అతడు వ్రాసినాడు. ఇది మన చరిత్ర కత్యంతముగా ఉపకరించును.

8. Historical and Descriptive Sketch of the Nizam's Dominions Bilgrami 2 Vols. ఈ గ్రంథము చాల విలువకలది.