పుట:Andrulasangikach025988mbp.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటినంతా కందనూరు నవాబు పుచ్చుకొని వెనగ గుళ్ళసంగతినే విచారింపడు. (కా.10) 'శ్రీశైలయాత్రకు తీసే హాశ్శీలు కందనూరు నవాబుకు చేరుచున్నది. (కా. 13) 'అగుడీ హాశ్శీలు మూలకముగా సంవత్సరము 1కి 18000 కందనూరు నవాబుకు వచ్చినా గుడి యేగతి పొందేదిన్ని విచారించడు. (కా. 20).

హైదరాబాదు 'షహరు చుట్టున్నూ చిన్న తిప్పలున్నవి. అనేక తిప్పల కొనలయందు మశీదులు కట్టబడియున్నవి. హిందూ దేవాలయములు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.' (కా. 35)

'ఇందలవాయి అను రామస్థలము చేరినాను. (కామారెడ్డి దాటిన తర్వాత ఇందల్వాయ వచ్చును.) ఈ తురకల రాజ్యమందు ఈ స్థలము కుంపటిలో తామర మొలచినట్లున్నది. తిరుపతి వదలిన వెనక రాజోపచారములతో ఆరాధన నడిచేగుడి యిది యొకటే చూచినాను. నా విచారణలో నున్ను వేరే లేవని తెలిసినది.' (కా. 43)

ఈ విధముగా ఇంగ్లీషువారి యొక్కయు, కర్నూలు నవాబుల యొక్కయు హైద్రాబాదు నవాబుల యొక్కయు పరిపాలనలో ఆంధ్ర దేశమందలి హిందూ మతమునకు క్షీణదశ సంప్రాప్తించి యుండెను. దాని కనుగుణ్యముగా హిందువులలో కులంతప్పులు, ఎచ్చు తచ్చులు, కొత్త కొత్త ఆచారాలు, అంక్షలు కొల్లలుగా పెరిగిపోయెను. జనులకు మత బోధ చేయు పీఠాధిపతు లేమూల నుండిరో యేమో ? ఆచార్యత్రయము తర్వాత వారి పీఠాలపై విభ్రాజమానులగుచూ వచ్చిన పీఠాధిపతుల స్మరణ యెచ్చటను కానరాదు. అట్టి అంధకారములో తత్త్వాలు బోధించే కొందరు భక్తులు మాత్రము తమకు చేతనైనంత సంస్కారము చేస్తూవచ్చిరి. మన సమీక్షా కాలములో బ్రహ్మానందయోగి, కంబగిరి, ఇంద్రపీఠి బ్రహ్మన్న, చిత్తూరు నరసింహదాసు, వరనారాయణదాసు, పరశురామ నరసింహదాసు, ఆదికేశవులు, వీరాస్వామి, శివయోగి, తోటగజేంద్రుడు, అంగప్ప మున్నగువారు పామరజనులలో మతప్రచారము చాలా చేసిరి.

కర్నూలు నవాబులు మతావేశపరులై చాలా దేవాలయాలను మసీదులుగా మార్చిరి. కర్నూలులోనే పెద్ద దేవాలయాలు పెద్ద మసీదులయ్యెను. కొందర హిందువులను తురకలనుగా జేసిరి. మహారాష్ట్ర దేశములో శివాజీకాలములో ముసల్మానులైన పలువురి హిందువులను శుద్ధిచేసి మరల హిందువులనుగా