పుట:Andrulasangikach025988mbp.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయుడు కనుక శ్రీరంగరాయడు తన పేరు పెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవుబందరు కట్టి మాన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణమని పేరుపెట్టి కట్టడమేకాక తానే సన్నిధానాథిపతి గనుక అదే నామకరణము ఆరంభములో చేసినందున చెన్నపట్టణము పేరు కలిగినది. తత్పూర్వము ఈ రేవును ఇంగ్లీషువారు మదిరాసు అంటూవచ్చినారు." మద్రాసు రేవులో ఇంగ్లీషువారు గుట్టగా కట్టెలకుప్పను తమ కోట నిర్మాణానికి వేసియుండిరి. అప్పుడు ఆ ప్రాంతమందుండిన డచ్చివారు తమ భాషలో కట్టెకుప్పకు మదారై అందురు. కాన దానిని మదారైస్ అనిరి. అదే మద్రాసు అయ్యెను. (369)

"ఇక్కడివారు |చెన్నపట్టణమువారు) ప్రకృతులు ఉపాయ వేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్ర కర్ణాటదేశాల మధ్య యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములైన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనము చేసినవారి తురకభాష యిప్పుడు దొరతనము చేసే యింగ్లీషువారి భాషయున్నూ నోట నానడము చేతనున్ను, పదార్థములుగా కొన్ని సంస్కృత వాక్యాలు అభ్యసించుట చేతనున్నూ ఇక్కడివారి ఉచ్చారణ స్పుటముగా ఉంటూ వచ్చుచున్నది. ఇక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషులపట్ల నిండా చొరవ జేసుకోగల వారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్రాభరణ ప్రియులేకాని నైజగుణమైన సాహసము నిండా కలవారుగా తోచలేదు.

తెలంగాణా పరిస్థితి

హైద్రాబాదు రాష్త్రములో తెలంగాణాను గురించి వీరాస్వామి తాను వెళ్ళిన దారిలో తగిలిన ప్రదేశాలలోని విశేషములను తెలిపినందున దీనిని గూర్చి ప్రత్యేకముగా వ్రాయవలసి యున్నది.

"హైద్రాబాదులోని కొల్లాపుర వనపర్త సంస్థానాలవారు తరుచుగా తగవులాడి ఒకరి గ్రామాలను ఒకరు కొల్లపెట్టి రైతులను హింసించి గ్రామాదులు పాడుచేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరికొకరికి సమరస పెట్టకుండా చందూలాలు ప్రభృతులు ద్రవ్యకాంక్షచేత ఉభయులకున్ను కలహములు పెంచి వేడుక చూచుచున్నారు." (24-25)