పుట:Andrulasangikach025988mbp.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసెను. వరదానది ఆవల నాగపూరు రాజ్యమని తెలిపినాడు. 'అక్కడ కాయరా అనే యూరు మొదలు తెనుగు సకృత్తుగా ఉన్నది.' (56)

విశాఖపట్టణము జిల్లాలోని తెనుగు భాషను గూర్చి యత డిట్లు వ్రాసెను.

సర్వసాధారణముగా ఈ దేశమందు తెనుగు భాష ప్రచురముగానున్నది. మాటలు దీర్ఘముగానున్ను, దేశీయమై రహస్యముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసు మోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావముగా దౌష్ట్యములు చేయతలచినా మంచి తియ్యని మాటలు మాత్రము వదలరు.' (335)

'గంజాము జిల్లా తెనుగు సీమకు మరొక హద్దు. గంజాం మొదలుగా కళింగదేశము ఆరంభ మవుటచేత ఇండ్లు, మనుష్యుల అలంకారాలు, దృష్టి దోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగి ఉన్నవి. చిన్న యిండ్లకు కూడా వాకిట పంచ తిన్నెలు పెట్టి కట్టినారు. ప్రతి స్త్రీ బులాకులు ముక్కర ధరించి వున్నారు. సమీపమున వుండే మాలుఝూ అన్న వూరిలో యెవరికిరాని తెనుగు భాష యక్కడ అందరికి వచ్చినది.' (319)

'నెల్లూరు దక్షిణములో తెనుగు సీమకు మరొక హద్దు. నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూవస్తారు. ఈ దేశములో పడమటినుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణమునుండి అరవమువచ్చి కలిసినది. ఉత్తరమునుంచి తెనుగు అదే రీతిగా వచ్చి కలిసినది. కనుక యీ మద్యదేశపు భాష (ఉత్తర దక్షిణ పినాకినీల మధ్య దేశభాష) యీ మూడు భాషలు మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆయా దేశములలోకి వెళ్ళి మాట్లాడపోతే ఆయా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

చెన్నపట్టణమును గూర్చి, అందలి భాషలను గూర్చి వీరాస్వామి గారిట్లు తెలిపినారు.

'200 ఏండ్ల క్రిందట (అనగా 1831 కి 200 ఏండ్ల పూర్వము) చంద్రగిరిలో బీజానగరపు (విజయనగరపు) సమస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా 'డే' అనే దొర యీ సముద్రతీరమందు ఒక రేవు బందరు కట్టించవలెనని యత్నముచేసి శ్రీరంగరాయుణ్ణి అడిగి వుత్తరువు తీసుకొని యీ ప్రాంతాలకు జమీందారుడైన దామర్ల వెంకటాద్రి నాయడిపేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృత