పుట:Andrulasangikach025988mbp.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ద్రావిడ దేశములో శూద్రులనున్నూ ముఖ్యముగా చండాలురనున్ను అగౌరవపరుస్తూ శూద్రులదృష్టిని చండాలుర సమీప వర్తిత్వమున్నూ కూడదని నిండా అగౌరవ పరచడముచేత వేల పర్యంతము ప్రజలు క్రీస్తుమతస్థులుగా పెదపాళెము మైలాపూరు క్రీస్తు గుళ్ళ వుత్సవాదులలో చూడబడుచున్నారు. (165)

విశాఖ పట్టణం జిల్లా వారిని గూర్చి ఇట్లు వ్రాసినాడు.

'ఈ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్న అగుపడుతారు. జాఫరా విత్తుల వర్ణము వేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడం కలిగి వున్నది. (335)

బాలకొండ నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరుకు 6 కోసుల దూరములో ఉన్నది. 'హైదరాబాదు వదలినది మొదలుగా పాలు పెరుగు మాత్రము తంబళ జాతివారి గుండా ఊరూరిలో సమృద్ధిగా దొరకును..... ఈ దేశములో తంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగల జాతివారు మషాల్ వేయుచున్నారు.' (పు 46)

తెలంగాణా చాకలివారు దివిటీలు పట్టుదురు. వీరు మంగళ్ళ కా పని నిచ్చినారు. ఇవి ఆనాటి తెనుగుజనులను గూర్చిన ముచ్చట.

ఇక మన తెనుగు భాషాస్థితి ఒక్కొక్క ప్రాంతమం దెట్లుండెనో కనుగొందము. 'కడప వదలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడతగినవారు సకృత్తుగా ఉన్నారు. తెలుగు మాటలు సర్వసాధారణముగా రాగసరళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మిచ్చేటప్పుడు శబ్దముల సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీయూరు ఆయూరికి ఎంత దూరమంటే నాకు యేమి యెరుక అని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండు కొన్నాడు అనడానికి పండినాడని అనుచున్నారు. హిందూస్థానీ తురకమాటలు తరుచుగా తెనుగు భాషలో కలిపి మాట్లాడుచున్నారు.' (48-49)

ఇవి రాయలసీమను గూర్చి చెప్పినమాటలు. తెనుగు దేశానికి దక్షిణమున కడప జిల్లా ఒక హద్దని ఇతని అభిప్రాయము. ఆదిలాబాదుకు ఉత్తరమున 10 క్రోసుల దూరముపై మేకలగండి అను ఘాటు కలదు. తర్వాత వరదానది దాటవలెను. 'హైదరాబాదు సరిహద్దు దానితో తీరిపోయింది' అని వీరాస్వామి