పుట:Andrulasangikach025988mbp.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గ్రంథమునుండి తెలియ రాలేదు. (మైసూరు, తమిళము, మలబారు జిల్లాల గూర్చివిరివిగా ఇందు వ్రాసినారు).

1813 లో పార్లమెంటులో ఇండియానుగూర్చి విచారణ చేస్తూ మన్రోను ఈ దేశ పరిస్థితులను విచారించగా అతడిట్లు చెప్పెను. 'సగటున ఇండియాలో వ్యవసాయపు కూలీలకు నెలకు 2 రూపాయీలనుండి 3 రూపాయీల కూలీ దొరకును. ఒక్కొక్క కూలీకి సంవత్సరానికి జీవన భృతికి 9 నుండి 13-8-0 రూపాయీల వరకు వ్యయమగును. జనులు గట్టి మోటు కంబళ్ళను నేసి వాడుకొందురు. అవి చాలా చౌక కాన ఇంగ్లీషు ఉన్ని కంబళ్ళు వారు కొనజాలరు. భారతీయులు ఉత్తమ పరిశ్రమ కలవారు. తెలివితేటలు కలవారు. మేలైన ఇంగ్లీషు పరిశ్రమల అనుకరింప గలవారు..' ఆ దేశములో స్త్రీలు బానిసలవంటి వారు కారా?' అన్న ప్రశ్నమునకు మన్రో యిట్లనెను. 'మన స్త్రీల కెంత పెద్దరికము కుటుంబములో కలదో వారికినీ అంతే కలదు.' 'మన వ్యాపారము వల్ల హిందువుల నాగరికతను వృద్ధిచేయవచ్చుకదా' అన్న ప్రశ్నమునకు మన్రో ప్రసిద్ధమగు ప్రత్యుత్తర మిట్లిచ్చెను. 'హిందూ నాగరికత అంటే యేమిటి? సైన్సలో, రాజ్యతంత్రములో, విద్యలో మనకంటే వారు తక్కువే, కాని ఉత్తమ వ్యవసాయ పద్ధతి, సాటిలేని వస్తు నిర్మాణ నిపుణత, జీవిత సౌఖ్యమునకు కావలసిన వాటిని సమకూర్చుట. ప్రతి గ్రామములో పాఠశాలను స్థాపించుట, దానము ఆతిథ్యము ఇచ్చుటలోని వితరణ, స్త్రీలను గౌరవించి సంభాషించుట, అనునవి నాగరికతా లక్షణాలైతే హిందువులు యూరోపు జాతుల కెవ్వరికినీ తీసిపోరు. ఇంగ్లండు ఇండియాలకు నాగరికతయే వ్యాపార వస్తువైన మన దేశమే దాని దిగుమతి వల్ల లాభము పొందగలదు.' మన్రో ఒక శాలువను ఇండియాలో కొని ఏడేండ్లు వాడుకొన్నను అది కొత్తదాని వలెనే యుండెను. కాన 'నాకు ఇంగ్లండు శాలువలు బహుమతిగా నిచ్చినను వాటిని తీసికొనను.' అని తన దేశ పరిశ్రమల హైన్యమును ప్రకటించెను.

స్ట్రాసీ (Stracey) అనునత డదే విచారణ సమితి యెదుట యిట్లు చెప్పెను. 'మనము హిందూస్తానీ పరిశ్రమల నాశనం చేసినాము. ఇప్పుడు భరతదేశము కేవలము భూమిపైననే ఆధారపడినది. నేటికిని (1813లో) ఇండియా పట్టునూలు బట్టలు ఇంగ్లండులో మన సరకులకంటే నూటికి 60 పాళ్ళు తక్కువధరల కమ్మును. అందుచేత మన ప్రభుత్వము వాటిపై