పుట:Andrulasangikach025988mbp.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వము గ్రామాలలో పన్నిద్ద రాయగాండ్ల కెంత భాగమిస్తుండిరో తెనుగు సీమలోని వివరాలు తెలియవు. కాని బుకాసన్ అనునతడు క్రీ.శ. 1800 లో బెంగుళూరులోని ఒక గ్రామములోని వివరాల నిచ్చినాడు. దాన్నిబట్టి మన తెనుగు దేశములోని విధానము నూహించుకొన వచ్చునని యుదాహరిస్తున్నాను.

గ్రామం మొత్తము సేద్యమువల్ల 2400 సేర్ల ధాన్యముకుప్ప అయ్యెను. దానినుండి ఈ క్రింది ఆయాలిచ్చిరి.

పురోహితుడు 5 సేర్లు
దర్మాలు 5 సేర్లు
జోసి 1 సేర్లు
బ్రాహ్మణుడు 1 సేర్లు
మంగలి 2 సేర్లు
కుమ్మరి 2 సేర్లు
కమ్మరి 2 సేర్లు
చాకలి 2 సేర్లు
సరాపు (ధాన్యం కొలుచువాదు) 4 సేర్లు
Beadle 7 సేర్లు
రెడ్డి 8 సేర్లు
కరణం 10 సేర్లు
తలారి 10 సేర్లు
దేశముఖు 45 సేర్లు
దేశాయి 45 సేర్లు
నేరడి 20 సేర్లు
మొత్తము 169 సేర్లు.

అనగా నూటికి అయిదుంబావు భాగముతో గ్రామస్థులకు చాకలి, కుమ్మరి, కమ్మరి, తలారి, మంగలి, వడ్ల మున్నగువారి సేవలు లభించుచుండెను. మిగత ధాన్యములో గుత్తేదారు నూటికి 10 పాళ్ళు తీసుకొనెడివాడు. మిగిలిన దానిలో ప్రభుత్వమునకు సగమిచ్చి తక్కిన సగము రైతులు పంచుకొనెడివారు. (Chapter XII. Romesh Dutt.) తెనుగు దేశమును గురించిన వివరాలు