పుట:Andrulasangikach025988mbp.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించుకొనియుండె ననవలెను. నేటికిని అచ్చట ఎక్కువగా (ఇతరత్ర తక్కువగా) కులభేదాలు, అంటు ముట్టు బాధ, అంటరానితనము కలదు. ఫ్రెంచి బోర్బను రాజులను గూర్చి వారు కొత్తది నేర్వలేదు; పాతది మరువలేదు; అన్న సామెత హిందూ మతమునకు కొంతవరకయినా వర్తించె ననవచ్చును. క్రైస్తవ మతబోధకులు పట్టుదలతో 500 మైళ్ళ దూరమునుండి సప్త సముద్రాలు సప్తఖండాలు దాటి ఆరు నెలలు ఓడలలో ప్రయాణము చేసి తల్లి పిల్లల వదలి మన దేశమందు నిలిచి మనభాషలూ అటవికుల భాషలూ నేర్చి ప్రచారము చేసి బళ్ళను వైద్యాలయాలను స్థాపించి నానాసేవలు చేసి తమ మతప్రచారము చేసినది నేటికిని భారతీయులు చూస్తూ వారి సేవలో దశాంశమయినను చేయనొల్లనివారై యున్నారు. మొత్తానికి ప్లాసీ యుద్ధానంతరము నుండి క్రైస్తవ మత వ్యాప్తికి విజృంభణము కలిగెను.

ఆర్థికస్థితి

ఈ సమీక్షాకాలములోని ఆంధ్రుల ఆర్థికపరిస్థితి యెట్టిదో కనుగొందుము. ప్లాసీ యుద్ధముతర్వాత దేశము యింగ్లీషువారి చేతుల లోనికి అతి వేగముగా పోయెను. తురకలు 1150 నుండి 1707 వరకు అనగా 600 ఏండ్లలో ఎంతబీభత్సము చేసినను పూర్తిగా దేశమును గెలువలేక పోయిరి. కాని 100 ఏండ్లలో యావద్బారతమును పూర్తిగా ఇంగ్లీషువారు గెలుచుకొనిరి. మన సమీక్షాకాలములో ఇంగ్లీషువిజేతలకు ప్రజల సౌకర్యాల సమాలోచనము కించిత్తు కూడా లేకుండెను. వారిది ప్రత్యక్ష పరీక్షాపహరణమే తమ దేశపు సరకులను ఇచ్చట అమ్ముటకై మన పరిశ్రమల నాశనము చేసిరి. మేరలేకుండా జనులు చావకుండానైన చూచుకొనక పన్నులు లాగిరి. వారి పరిపాలనములో క్షామా లెక్కు వయ్యెనని వారి సజాతీయుడగు డిగ్బీ 60 ఏండ్లనాడే వ్రాసెను. ముసల్మానులు హిందువులను దోచినదంతయు దేశమందే యుండెను. మరల క్రమముగా అదంతయు జనులకు చెందెను. కాని ఇంగ్లీషువారు వ్యాపారముద్వారా, పన్నులద్వారా, దోపీడీలద్వారా, ఉద్యోగులద్వారా గ్రహించిన దంతయు ఏడు సముద్రాలు దాటి తిరిగిరాకుండా ఇంగ్లండు చేరెను. ఇది మన ఆర్థిక నాశనమునకు కారణ మయ్యెను.