పుట:Andrulasangikach025988mbp.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కువ పని చేసినట్టివి కావు. తుపాకులు కూడ కొద్దికొద్దిగా వాడుకలోకి వచ్చి యుండెను. కాని వాటి ప్రసక్తి వాఙ్మయములో శుకసప్తతికారుని నుండియే కానవస్తున్నది. కదిరీపతి మన్మథుడు ప్రాతకాలపు బాణాలను పారవేసి 'తమ్మిరుమ్మీ ఫిరంగీలను' చేబట్టెను. (తుమ్మిరుమ్మి ఫిరంగి దొరతురంగీ విలాసముతో అనగా చిలుక వలె) ఒక రెడ్డికోటలు నడిచెనట! శుకసప్తతి 15 వ కథ. రూం అను యూరోపు పట్టణములో ఫిరంగీలు ప్రసిద్ధముగా నుండెనేమో ? భారతీయ సైన్యమునకు క్రమవిధానమగు సాముదాయిక యుద్ధ శిక్షణము లేకుండెను. ఇంగ్లీషువారు యూనిఫారమును సిపాయీల కిచ్చి ఉత్తమ యుద్ధశిక్షణ మిచ్చిరి. వారు సంఖ్యాబలముపై ఆధారపడలేదు. శిక్షణములేని సైన్యము లక్షలున్నను దానిని క్రమశిక్షణము, మేలైన మారణ యంత్రాలు, నిపుణతకల సేనానులు కల సైన్యము వేలసంఖ్యలో నున్నను తప్పక జయించినఘట్టాలు చరిత్రలో అడుగడుగునకు కానవస్తున్నవి. ఇంగ్లీషువారు మరొకతంత్రమును వెంటదెచ్చిరి. మోసమువారి ముఖ్యాయుధము. వారు మనదేశ ద్రోహులను సృష్టించినట్టుగా తురకలుకూడ సృష్టింపజాలిన వారు కారు. భారతదేశ మందు బహు రాజుల యునికి, హిందూ ముసల్మూనుల సహజవైరము, మొగలాయి రాజ్యపతనము, అన్నియు ఇంగ్లీషువారి కనుకూలమయ్యెను. ఒకరాజు ని కొకనిపై ఉసికొల్పి సహాయపడి రాజ్యాలు సంపాదించిరి. బెంగాలును మిర్జాఫరు ద్రోహము చేతను, తమ మోసముచేతను, జయించిరి. ఈ విశిష్టతలు గుర్తుంచుకొనిన మన దేశ చరిత్రలోని మార్పులు అవగాహనమగును. ముసల్మానులు బాహాటముగా అతి క్రూరముగా కత్తితో తమ మత ప్రచారము చేసిరి. ఇంగ్లీషువారు ఉపాయముతో క్రైస్తవ మతప్రచారము చేసిరి. దక్షిణమున మలబారులో క్రీ.శ. 52లో సంత్ తామన్ అను క్రైస్తవ ఫాద్రీ మత ప్రచారము చేసెను. ఆనాటి 'సిరియన్ క్రిస్చియనులు' నేడును అచ్చట నున్నారు. ఈ విధముగా క్రీస్తుశకారంభము నుండియే మనకు క్రైస్తవ వాసన తగిలినది కాని అది అత్యల్పము. క్రీస్తుమత వ్యాప్తిని పోర్చుగీసువారు తురకలవలెనే మలబారులోను, తమిళములోను, పశ్చిమ తీరములోను చేసియుండిరి. ఫ్రెంచివారు అదే పనిచేసిరి. అబేడుబాయి (Abbe Dubois) అను ఫ్రెంచి ఫాద్రి హిందువులవలె రుమాల దోవతి అంగీ ధరించి తమిళములోని 'పరయా'లలో తిరిగి పలువురిని క్రైస్తవులనుగా చేసెను. అత డానాటి హిందూ మతమును పూర్తిగా దూషిస్తూ ఒక పెద్ద గ్రంథమే వ్రాసెను. ఘోర కులాచార భేదాలుకల తమిళ దేశపు హిందూమతము ఆ దూషణమున కర్హత సంపా