పుట:Andrulasangikach025988mbp.pdf/360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైళ్ళ దూరములో షంషాబాదుకు 20 మైళ్ళ దూరములో ఉన్న నర్కోడాలో 'నిజాంరత్నం' అనునది దొరికెను. అది 335 క్యారట్ల తూకముది. దాని వెల 2 లక్షల 20 వేల పౌనులు. పై ప్రదేశాలలో కాక కర్నూలు జిల్లాలోని రామళ్ళకోటలో రవ్వలు దొరకుచుండెను. రవ్వలకోటయే రామళ్ళకోటయయ్యెను. రాయలసీమలో వజ్రకరూరు అను గ్రామము కలదు. అందుకూడ వజ్రాలు దొరకుచుండెను. నేటికిని అచ్చట పలువురు వర్షాలు కురిసినవెంటనే వరద పారిపోయిన తావులందు రత్నాలకై వెదుకుచుందురు. వారి కప్పుడప్పుడు రత్నాలు దొరకుచునే ఉండును. ఇప్పుడీ ప్రదేశాలలో వెచ్చటను గనులు త్రవ్వుటలేదు. గుత్తివద్ద మునిమడుగులోను రత్నాల గనులుండెను.

వేణుగోపాల శతకములోని

           అవనీశ్వరుడు మందుడయన నర్థుల
           కియ్యవద్దని వద్ద దివాను చెప్పు
           మునిషి యొకడు చెప్పు బకిషి యొకడు
           చెప్పు తరువాత ముజుందారు చెప్పు
           తలద్రిప్పుచును శిరస్తా చెప్పు
           వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు
           దేశపాండ్యాతాను తినవలెనని చెప్పు
           ముతనద్ధి చెవిలోన మొనసి చెప్పు.

అను పద్యములోని పై పదాలనుబట్టి నవాబుల ప్రభుత్వము బాగా తెనుగుసీమలో పాదుకొన్నదని తెలియరాగలదు. ఈ శతక కారుడు తన కాలపు తెనుగు క్షత్రియులను వర్ణించినాడు. వారు రాజులు రాచవారు అయియుందురు.

          'కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు
           చలువ వస్త్రములు బొజ్జలు కఠార్లు
           కాసెకోకలు గంపెడేసి జందెము
           లును తలవారు జలతారు డాలువార్లు
           సన్నపు తిరుచూర్ణ చిన్నెలు కట్ణాలు
           జొల్లువీడెములును వల్లెవాటు
           దాడీలు వెదు రాకు తరహాసొగసు కోర్లు