పుట:Andrulasangikach025988mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెను. సైనికులను యుద్ధమందు ప్రోత్సాహించి శత్రువులను నాశనము చేయవలెను. అని చాల విపులముగా పై గ్రంథమందు వ్రాయబడినది. చాళుక్యుల యుద్ధ పద్ధతినుండి కాకతీయాది ప్రభువుల యుద్ధ విధానమును కొంత తెలుసు కొనవచ్చును.

పశ్చిమ చాళుక్యులు యుద్ధములో గుఱ్ఱముల ప్రాముఖ్యమును గమనించి యుండిరి. సోమేశ్వరు డిట్లు వ్రాసెను. "యవనదేశ మందును కాంభోజదేశ మందును (ఆఫ్‌ఘనిస్తానము) పుట్టిన గుఱ్ఱములను యుద్ధమం దెట్లుపయోగింపవలెనో ఆ శిక్షణము పొందిన సైనికులు సాధించి యుండిన ఆ గుఱ్ఱపు బలము ఉత్తమమైనదగును. శత్రవులు సుదూరమం దుండినను ఆ దళమువారిని జయించి రాగలదు. గుఱ్ఱాలచే కీర్తి లభించును. ఎవనికి ఆశ్వికబల ముండునో వానిరాజ్యము స్థిరముగా నుండును (యస్యాశ్వా:తస్యభూస్థ్సిరా)

(అభిలషి. ప్ర 1. అ 2. పుట 99)

అ కాలమున రాజులు సంపన్నులు. ఏ విధముగా భోగము లనుభవించిరో అభిలషితార్థమునుండి గ్రహింపవచ్చును. అందలి విషయాలు నతి సంగ్రహముగా సూచింతును.

స్నానగృహము మెరిసే స్తంభాలతో, స్పటిక వేదికతోను, కాచకుట్టిమములతోను, చిత్రములతోను శోభించునదై యుండెడిది. దినము మార్చి దినము అభ్యంగ స్నానము చేయవలెను. ద్వితియా, దశమీ, ఏకాదశీ దినాలు వర్జ్యములు. గేదంగి, జాజికాయ, పున్నాగము, చంపకము, యంత్రసంపీడితమగు తిలతైలమందు కాచి శిరస్స్నానమునకు వాడవలెను. నలుగులో కోష్ఠము, తక్కోలము,ముస్తలు, మాచిపత్రి, తగరం. మాంసీ, వాయింట, మెట్టతామర దుంప వీటి గడ్డలను తీసుకొని నీడలో ఎండించి నిమ్మ, తులసి, అర్జకము, వీటి ఆకులు వాటితో కలిపి ఏలక, జాజి, సర్షపము, తిలలు, కొత్తిమిరి, తగిరిస, లవంగము, లోధ్ర, శ్రీగందము, అగరు మొదలయినవి కూడా కలిపి సిద్ధము చేయవలెను.

వారి తాంబూలము అసాదారణ మైనది. వక్కలను కర్పూరమునీటితో తడిపి శ్రీఖండమును కస్తూరిని కలిపి ఎండించి ఇంకా ఇతర ద్రవ్యాలతో శుద్ధి చేయవలెను. పిడికలతో పుటముపెట్టిన ముత్యముల భస్మమును సున్నముగా