పుట:Andrulasangikach025988mbp.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అయ్యో! ఈ ఆంధ్రదేశములందు నమందదురితనిరతులై యెల్లప్పుడు బెల్లుగ తురకలే తిరుగుచున్నవారు :

        యవను లింద మంద జవనాశ్వముల నెక్కి దేవతాలయాల దీర గూల్చి
        సవనధర్మ సమితి సమసిపోవగ జేసి భువనభీకరులుగ భువి జరింత్రు॥

యవనులు ఒక్కొక్కడు కోపముతో సవారియై కత్తి తిప్పుతూ మైదానములో దూకిన ఒకవేయి (ఆంధ్ర) యోధులు కూడా భయపడి పారిపోతున్నారు. మరియు:-

        త్రావగనిమ్ము కల్లు, పర దారల బెల్లు హరింపనిమ్ము, నా
        నావరదేశముల్ తిరిగి నాశనము సేయగనిమ్ము, నేమముల్
        వావిరి ద్రోవనిమ్ము మృద వాటి దృణమ్మను బోలే మాని మే
        నే, విబువేంద్ర పట్టణ వినిష్ట కవాటము ప్రక్కలింత్రె పో॥
""

భద్రాచల ప్రాంతమువాడేమో క్రీ.శ. 1750 ప్రాంతమువాడయినట్టి భర్లా పేరకవి యనునతడు భద్రగిరి శతకములో పూర్తిగా గోగులపాటి కూర్మనాథునివలెనే తురకలవలన చాలా బాధపడి భద్రాద్రిరాముని చెడ దిట్టినాడు. ఆ పద్యాలన్నియు నుదాహరించిన గ్రంథము పెరుగును కాన తురక సర్దారులు, సేనానులు, స్థానికాధికారులు చేసి దుండగాలను వర్ణించిన భాగాంశములను కొన్నింటి నుదాహరింతును.

           'అచ్చిద్రకర్ణుల యాజ్ఞ నుండగలేక
            తురకల కెదురుగా నరుగలేక
            చేరి ఖానులకు తాజీము లీయగలేక
            మును నమాజు ధ్వనుల్ వినగలేక'

      'కాడు చేసిరికదా కల్యాణమండపాగార వాహన గృహాంగణము లెల్ల'
      'సంస్కృతాంధ్రోక్తుల సారంబు లుడివోయె వపసవ్య భాషలనమరె జగము'
      'సత్రశాలాంగణల్ చలువ పందిరులు బబ్బరటటఖానుల చప్పరము లయ్యె'
      'పారిపోవగనైన పట్టెలు నాకక విడురురే వైష్ణవ వితతి నెల్ల'

పేరకవి తన శతకములో 'ధంసా'ను పేర్కొన్నాడు. ధంసాయుండినది హైద్రాబాదులోని నిర్మలలో, కావున కవి నిర్మల ప్రాంతమువాడై యుండునేమో?