పుట:Andrulasangikach025988mbp.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'యుద్ధతంత్రమందు ముస్లిం సుల్తానులు హిందువులకన్న నిస్సందేహముగా నిపుణులై యుండిరి. వారు విషయ లోలురు కానంతవరకు వారిని జయించుటకు హిందువులకు సాధ్యాముకాకుండెను. చలికొండల నుండి దిగి వచ్చిన తురకల శారీరక శక్తి చాలా హెచ్చు. వారి మాంస బుక్తి శాకాహారులను నిర్జించు శక్తి నిచ్చెను. వారిలో కులభేదాలు లేవు. అంటు ముట్టు, భోజన నిషేధాలు వారికి లేవు. కాఫిర్లను చంపిన నేరుగా స్వర్గ మబ్బుననియు, యుద్ధాలలో మతానికై చచ్చిన 'షహీదు'లై సూటిగా జన్నత్ లోనికి జొరబడుదురనియు వారికి బోధించి యుండిరి. వారు పరదేశమునుండి వచ్చినవారు. ఓడితే సర్వనాశనమని వారికి తెలియును. కాన జయోవా మృత్యుర్వా అన్న సిద్దాంతమును గట్టిగా నాశ్రయించిరి. ఘోరకృత్యాలతో హిందువులను బాగుగా బెదరించి యుంచిరి. దేవాలయాలలో, నగళ్ళలో, పట్టణాలలో అపారమగు ధనము, రత్నములు, బంగారు దొరకునని వారెరిగినందున తమ సాహసానికి గొప్పప్రతిఫలము దొరకునని ఉత్సాహముతో యుద్ధము చేసెడివారు. హిందువుల యుద్ధతంత్రము పురాణకాలము నాటిది. ప్రాచీన నీతిశాస్త్రాలపైననే వారింకను ఆధారపడి యుండిరి. కొత్త పరిస్థితులకు తగినట్లు తమ తంత్రాలను మార్చుకొన్నవారు కారు. తమ ప్రతిపక్షుల విధానాలను వారు గమనించినవారు కారైరి. హిందూ సైన్యములో కులభేదా లుండుటయే కాక నానారాజుల కూటమిచే సైన్య మొక నాయకునికి గాక పలువురి నాయకులకు లోబడినదై నానా ముఖాల నడిచెను. విదేశి సైన్యము ఏక నాయక పరిపాలితము, ఆ సేనలు హిందువుల నేరీతిగ కాతరులనుగా జేయవలెనో ఆ కీలకా లెరిగి యుండెను. ముఖ్యముగా తమ ఆశ్విక దళములతో భయంకరముగా హిందువులపై బడి వారిని చెల్లా చెదరు చేసెడివారు. ప్రాచీన యుద్ధ తంత్ర ప్రకారము హిందువు లేనుగులపై ఎక్కువగా నాధారపడిరి. అది వారి పొరపాటు. ఘోటకముల దాటి ముందు ఏనుగుల మందగమనము పనికిరానిదయ్యెను. హిదువులు సహితము గుర్రముల సేనకలవారై యున్నను దానిని వారు వృద్ధి చేసుకొన్న వారు కారు." (పుట 257)

ఈ చరిత్రకారుని నిర్ణయములో ప్రత్యక్షరము సత్యమే యని చెప్పవలెను.

అది విజయనగర రాజులు బహమనీ సుల్తానుల రాకకు తట్టుకొన జాలని వారైరి. రెండవ దేవరాయలు (1421-48) ముసల్మాను సవార్ల ఆధిక్యతను